Telugu Global
National

కాంగ్రెస్ లో సిద్దూ కలకలం.. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..

ఇటీవలే పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సిద్ధూ.. అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఇకపై కాంగ్రెస్ లో ఓ సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తానని అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. సిద్ధూతో మాజీ సీఎం అమరీందర్ సింగ్ కి వైరుధ్యాలున్న విషయం తెలిసిందే. సిద్ధూని పీసీసీ చీఫ్ గా నియమించడంతోపాటు.. ఆయనకు వత్తాసు పలికే క్రమంలో అమరీందర్ తో బలవంతంగా రాజీనామా చేయించింది అధిష్టానం. అమరీందర్ తర్వాత చరణ్ జీత్ సింగ్ చన్నీ నాయకత్వంలో […]

కాంగ్రెస్ లో సిద్దూ కలకలం.. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..
X

ఇటీవలే పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సిద్ధూ.. అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఇకపై కాంగ్రెస్ లో ఓ సామాన్య కార్యకర్తలాగా పనిచేస్తానని అధినేత్రి సోనియాకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. సిద్ధూతో మాజీ సీఎం అమరీందర్ సింగ్ కి వైరుధ్యాలున్న విషయం తెలిసిందే. సిద్ధూని పీసీసీ చీఫ్ గా నియమించడంతోపాటు.. ఆయనకు వత్తాసు పలికే క్రమంలో అమరీందర్ తో బలవంతంగా రాజీనామా చేయించింది అధిష్టానం. అమరీందర్ తర్వాత చరణ్ జీత్ సింగ్ చన్నీ నాయకత్వంలో రెండు రోజుల క్రితమే కొత్త మంత్రి వర్గం కొలువుదీరింది. అయితే అంతలోనే సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడం పంజాబ్ కాంగ్రెస్ లో కలకలం రేపింది.

విమర్శలు తట్టుకోలేకే రాజీనామా చేశారా..?
సిద్దూకి పాక్ తో సంబంధాలున్నాయని, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్,ఆ దేశ ఆర్మీ చీఫ్ బజ్వా.. సిద్దూకు స్నేహితులని, సిద్ధూ ఒకవేళ పంజాబ్ సీఎం అయితే.. అది దేశ భద్రతకే ముప్పు అని ఆమధ్య అమరీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత.. కొత్త సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ మంత్రివర్గంలో రాణా గుర్జీత్ సింగ్ ను చేర్చుకోవడం కూడా వివాదాలకు కారణం అయింది. ఇసుక కుంభకోణంలో ఇరుక్కుని, అవినీతి ఆరోపణలు ఎదుర్కంటున్న గుర్జీత్ కు మంత్రి పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు అదిష్టానానికి లేఖలు రాశారు. అయితే ఆయనను మంత్రి వర్గంలో చేరకుండా ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో సిద్ధూ రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. పంజాబ్ సంక్షేమం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ సిద్ధూ తన రాజీనామా లేఖను సోనియాకు పంపిస్తూ, ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

దళిత సీఎంను సిద్ధూ అంగీకరించలేకపోతున్నారా..?
పంజాబ్ లో ఓ దళితుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం సిద్ధూకి నచ్చలేదని, అందుకే ఆయన రాజీనామా చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఒక పేదరాలి కొడుకు సీఎం కావడాన్ని సిద్ధూ జీర్ణించుకోలేక పోయారని ఆరోపించారు ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్.

నేను ముందే చెప్పాగా..!
సిద్ధూ రాజీనామా చేసే సమయానికి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ నేతలతో ఆయన మంతనాలు జరిపేందుకు హస్తిన చేరుకున్నట్టు సమాచారం. సిద్దూ రాజీనామాపై వెంటనే స్పందించిన అమరీందర్.. తాను ముందే ఈ పరిణామాన్ని ఊహించానని అన్నారు. సిద్ధూలో స్థిరత్వం లేదని, సిద్ధూలాంటి వ్యక్తి పంజాబ్ లాంటి సరిహద్దు రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడని మరోసారి విమర్శించారు.

First Published:  28 Sep 2021 7:21 AM GMT
Next Story