Telugu Global
NEWS

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు : తెలంగాణ ఎమ్మెల్యేల అరెస్ట్..!

తెలంగాణలో నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వినూత్న నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించడంతో నలుగురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్రపు బగ్గిపై వచ్చారు. పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ గుర్రపు బగ్గితో అసెంబ్లీ లోకి వెళ్లేందుకు […]

రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు : తెలంగాణ ఎమ్మెల్యేల అరెస్ట్..!
X

తెలంగాణలో నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వినూత్న నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించడంతో నలుగురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.

రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్రపు బగ్గిపై వచ్చారు. పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ గుర్రపు బగ్గితో అసెంబ్లీ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారించినప్పటికీ వారు వినలేదు. గుర్రపు బగ్గితో అసెంబ్లీలోకి వెళ్తామని పట్టుబట్టారు. దీనికి పోలీసులు నిరాకరించడంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.

చివరికి పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు చేపట్టిన భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపడం లేదంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్, పీఎం మోదీ ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు.

First Published:  27 Sep 2021 1:34 AM GMT
Next Story