Telugu Global
Cinema & Entertainment

ఆ సాంగ్ నిజంగానే "బాగుంటుంది"

సిద్ శ్రీరామ్ గోల్డెన్ వాయిస్ పడితే చాలు పాట హిట్టవ్వాల్సిందే. అతడు పాడిన పాటల్లో దాదాపు 99శాతం సక్సెస్ అయ్యాయి. ఇప్పుడీ స్టార్ గాయకుడు మరో పాట పాడాడు. అది కూడా సూపర్ హిట్టయింది. ఈరోజే రిలీజై ఈరోజే హిట్ అయింది. ఆ పాట సంగతేంటో చూద్దాం. ఆది సాయికుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘అతిధి దేవోభవ’. శ్రీనివాస క్రియేషన్స్ ప‌తాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిమేర నాగేశ్వర్ ఈ […]

ఆ సాంగ్ నిజంగానే బాగుంటుంది
X

సిద్ శ్రీరామ్ గోల్డెన్ వాయిస్ పడితే చాలు పాట హిట్టవ్వాల్సిందే. అతడు పాడిన పాటల్లో దాదాపు 99శాతం
సక్సెస్ అయ్యాయి. ఇప్పుడీ స్టార్ గాయకుడు మరో పాట పాడాడు. అది కూడా సూపర్ హిట్టయింది. ఈరోజే
రిలీజై ఈరోజే హిట్ అయింది. ఆ పాట సంగతేంటో చూద్దాం.

ఆది సాయికుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘అతిధి దేవోభవ’. శ్రీనివాస క్రియేషన్స్
ప‌తాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిమేర నాగేశ్వర్ ఈ
చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మొద‌టిపాట‌గా ఓ ప్రేమ గీతాన్ని
విడుద‌ల‌చేశారు. ఆ పాట సంగీత ప్రియుల్ని అల‌రిస్తోంది.

బాగుంటుంది నువ్వు నవ్వితే అంటూ సాగే ఈ గీతానికి భాస్కర భట్ల సాహిత్యం అందించ‌గా లేటెస్ట్‌ సింగింగ్
సెన్సేషన్ సిద్ శ్రీరామ్, నూతన మోహన కలిసి ఈ పాటను ఆలపించారు. శేఖర్ చంద్ర మంచి బాణీలు
సమకూర్చారు. యూత్‌ని విప‌రీతంగా ఆకట్టుకుంటున్న ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

ఈ పాటతో సినిమా మీద అంచనాలు మ‌రింత‌ పెరిగాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల
తేదీని మేకర్స్ ప్రకటించబోతోన్నారు.

First Published:  27 Sep 2021 8:50 AM GMT
Next Story