Telugu Global
Cinema & Entertainment

సినిమా ఫంక్షన్లో పవన్ పొలిటికల్ స్పీచ్..

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను టార్గెట్ చేసుకుని సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఏపీలో సినిమాలు ఆపేసి లక్షలాదిమంది పొట్టకొడుతున్నారని అన్నారు. వకీల్ సాబ్ సినిమా లేకపోయి ఉంటే.. ఈ పాటికే ఏపీలో సినిమాలు విడుదలై ఉండేవని చెప్పారు. కావాలంటే తన సినిమాలు ఆపి మిగతా వారి సినిమాలను వదిలేయాలని సూచించారు […]

సినిమా ఫంక్షన్లో పవన్ పొలిటికల్ స్పీచ్..
X

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను టార్గెట్ చేసుకుని సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఏపీలో సినిమాలు ఆపేసి లక్షలాదిమంది పొట్టకొడుతున్నారని అన్నారు. వకీల్ సాబ్ సినిమా లేకపోయి ఉంటే.. ఈ పాటికే ఏపీలో సినిమాలు విడుదలై ఉండేవని చెప్పారు. కావాలంటే తన సినిమాలు ఆపి మిగతా వారి సినిమాలను వదిలేయాలని సూచించారు పవన్ కల్యాణ్. మేం సినిమాలు తీస్తే, మీరు టికెట్లు ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. సినిమా వాళ్లని కూడా వ్యాపారాలు చేసుకోనీయాలని అన్నారు.

బడ్జెట్ చిన్నదే, కానీ ప్రభావం పెద్దది..
సినిమా ఇండస్ట్రీ బడ్జెట్ తక్కువేమో కానీ ప్రభావం చాలా పెద్దదని అన్నారు పవన్ కల్యాణ్. తెలుగు చిత్ర పరిశ్రమవైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. పరిశ్రమలోని పెద్దలందరూ థియేటర్ల సమస్యపై గొంతెత్తాలని, చిరంజీవిలాగా బతిమిలాడుకుంటే పనులు కావని హితవు పలికారు. సినిమావాళ్ల పారితోషికాల గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, అది ఎవరినీ దోచింది కాదని, కష్టార్జితమని చెప్పారు పవన్ కల్యాణ్. ప్రజలకు వినోదాన్ని అందించడానికి కండలు పెంచి, కష్టపడి, షూటింగుల్లో ఒళ్లు హూనం చేసుకుని సంపాదించిన సొమ్ములో 45శాతం ప్రభుత్వానికి ట్యాక్స్ లు కడుతున్నామని అన్నారు.

సాయితేజ్ పై అలాంటి ప్రచారం ఎందుకు..?
సాయితేజ్‌ ప్రమాదానికి గురైతే చాలామంది సానుభూతి తెలిపారని, మీడియాలో కొంతమంది నిర్లక్ష్యంగా మాట్లాడారని, రోడ్డు ప్రమాదంపై లేనిపోని కథనాలు అల్లారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. సాయితేజ్ కోమాలో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడలేరని, ఆయనపై కథనాలు ప్రసారం చేసేవారు కాస్త కనికరం చూపాలన్నారు. అలాంటి వార్తల బదులు, కోడికత్తి కేసు, వైఎస్ వివేకా హత్యకేసుపై కథనాలు ఇవ్వాలని సూచించారు. సినిమావాళ్ల గురించి కాకుండా, పొలిటికల్‌ క్రైమ్‌ గురించి మాట్లాడాలని హితవు పలికారు.

First Published:  25 Sep 2021 9:40 PM GMT
Next Story