Telugu Global
Cinema & Entertainment

బ్యాచిలర్ మరోసారి డేట్ మార్చాడు

అక్కినేని అఖిల్ సినిమాకు మరో కొత్త డేట్ వచ్చింది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదాపడిన ఈ సినిమాను ఈసారి దసరాకు రిలీజ్ చేస్తామని ప్రకటించింది యూనిట్. అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. […]

బ్యాచిలర్ మరోసారి డేట్ మార్చాడు
X

అక్కినేని అఖిల్ సినిమాకు మరో కొత్త డేట్ వచ్చింది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదాపడిన ఈ
సినిమాను ఈసారి దసరాకు రిలీజ్ చేస్తామని ప్రకటించింది యూనిట్. అల్లు అరవింద్ సమర్పణలో
బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ
సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం రిలీజ్ పోస్టర్ విడుదల అయింది. ఇందులో అఖిల్, పూజా హెగ్డే చేతులు పట్టుకొని ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది యూనిట్.

త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్.
ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. మూవీలో పూజా హెగ్డే పాత్ర హైలెట్ అంటున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  26 Sep 2021 8:28 AM GMT
Next Story