Telugu Global
Others

ఫిట్ గా ఉండాలంటే.. ఈ ఒక్క బ్యాండ్ చాలు

రోజువారీ ఎక్సర్ సైజులు చేయాలంటే దానికి చాలా పరికరాలు కావాలి. లేదా రోజూ జిమ్ కైనా వెళ్లాలి. కానీ పెద్దపెద్ద బరువులెత్తకుండా, జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే కసరత్తులు చేసుకునే పరికరమొకటుంది. దీంతో ఎక్కువగా కష్టపడకుండా సింపుల్ వే లో బాడీని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. అదే రెసిస్టెన్స్ బ్యాండ్. దీన్ని ఎలా వాడాలంటే.. రొటీన్‌కు భిన్నంగా ఫిట్‌నెస్‌లో కూడా సరికొత్త వర్కవుట్స్ పుట్టుకొచ్చాయ్. ఫిట్‌నెస్ ప్రియులు కూడా ఈ ట్రెండీ ఎక్సర్‌‌సైజ్‌లను ఇష్టంగా ఫాలో అవుతున్నారు. రెసిస్టెన్స్ బ్యాండ్ […]

ఫిట్ గా ఉండాలంటే.. ఈ ఒక్క బ్యాండ్ చాలు
X

రోజువారీ ఎక్సర్ సైజులు చేయాలంటే దానికి చాలా పరికరాలు కావాలి. లేదా రోజూ జిమ్ కైనా వెళ్లాలి. కానీ పెద్దపెద్ద బరువులెత్తకుండా, జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే కసరత్తులు చేసుకునే పరికరమొకటుంది. దీంతో ఎక్కువగా కష్టపడకుండా సింపుల్ వే లో బాడీని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. అదే రెసిస్టెన్స్ బ్యాండ్. దీన్ని ఎలా వాడాలంటే..

రొటీన్‌కు భిన్నంగా ఫిట్‌నెస్‌లో కూడా సరికొత్త వర్కవుట్స్ పుట్టుకొచ్చాయ్. ఫిట్‌నెస్ ప్రియులు కూడా ఈ ట్రెండీ ఎక్సర్‌‌సైజ్‌లను ఇష్టంగా ఫాలో అవుతున్నారు. రెసిస్టెన్స్ బ్యాండ్ అనేది ఒక సాగే ఎలాస్టిక్ లాంటిది. దీని సాగే గుణన్ని ఉపయోగించుకుని రకరకాల రీతుల్లో వ్యాయామాలు చేసుకోవచ్చు.

మజిల్ స్ట్రెంత్ కోసం
రెసిస్టెన్స్ బ్యాండ్ ఓ సింపుల్ ఫిట్‌నెస్ పరికరం. ప్రత్యేకించి మజిల్ బిల్డింగ్‌కు ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటికి ఉండే సాగే గుణం వల్ల వర్కవుట్స్ చేసేటపుడు కండరాలపై మరింత శ్రమ పడుతుంది. దాంతో.. జిమ్‌లో బరువులు ఎత్తినప్పుడు ఎముకలు, కండరాలకు అందే వ్యాయామమే ఈ బ్యాండ్ వల్ల కూడా కలుగుతుంది.

ఫుల్ బాడీ వర్కవుట్
అంతేకాకుండా దీని ద్వారా శరీరంలోని ప్రతి కండరానికి పూర్తి వ్యాయామం అందుతుంది. ఈ వ్యాయామాలతో ముఖ్యంగా కండరాలు, మోకాళ్లు, కీళ్లు బలంగా తయారవుతాయి. అంతేకాకుండా ఫిజియోథెరపీలో రిహాబిలిటేషన్ కోసం కూడా ఈ వర్కవుట్స్‌ని వాడుతుంటారు. రెసిస్టెన్స్ బ్యాండ్ ఉపయోగించి భుజాలు, మెడ, వీపు, తొడలు, మోకాళ్లు.. ఇలా శరీరంలోని ప్రతి భాగం, ప్రతి కండరం పై ప్రభావం చూపేలా ఈ వ్యాయామాలు చేయొచ్చు.

రెప్స్‌
ఈ బ్యాండ్‌ని కాలి కింద అదిమిపెట్టి చేతులతో హ్యాండిల్‌పట్టుకొని బలాన్నంతా ఉపయోగిస్తూ ఐదు నుంచి ఇరవైసార్లు కిందికిపైకి, వెనక్కిముందుకి రెప్స్‌చేస్తుండాలి. ఇలా చేస్తే.. మెడ, భుజం, మోకాలు, వెన్ను నొప్పులు తగ్గుతాయి.

బెంట్‌ఓవర్‌రో
మోకాళ్లను కిందికి వంచి వెన్నెముకను నిటారుగా ఉంచాలి. వంగేటపుడు రెసిస్టెన్స్‌ట్యూబ్‌ని పైకి లాగుతూ వదులుతూ ఉండాలి. ఇలా చేస్తే వెన్నెముక కండరాలు గట్టి పడతాయి. ఇలా సెట్‌కి ఇరవై చొప్పున రెండు మూడు సెట్‌లు చేయాలి.

లాభాలివి..
రెసిస్టెన్స్ బ్యాండ్లు చాలా తక్కువ ఖర్చుతో కొనుక్కోవచ్చు. వీటి ధర మూడొందల నుంచి మూడు వేల రూపాయల వరకూ ఉంటుంది.
దీనితో పూర్తి శరీరానికి వ్యాయామం అందుతుంది. ఒక్క రెసిస్టెన్స్ బ్యాండ్ ఉంటే దాదాపు జిమ్‌లో చేసే అన్నీ వ్యాయామాలు చేసుకోవచ్చు.
ఎలాంటి బరువులు ఎత్తకుండానే పెద్ద కసరత్తులతో పొందే ప్రయోజనాల్ని ఈ బ్యాండ్‌తో సులభంగా పొందొచ్చు.
ఈ బ్యాండ్స్ బరువు ఉండవు, పెద్దగా స్థలం అక్కర్లేదు. బ్యాండ్‌ని ఎక్కడికైనా తేలిగ్గా వెంట తీసుకెళ్లొచ్చు. దీనితో ఎలాంటి ప్రమాదాలుండవు. పూర్తిగా సేఫ్.
శక్తిని బట్టి లైట్‌, మీడియం, హెవీ.. మూడురకాల్లో ఈ బ్యాండ్లు ఉంటాయి. ఎవరికి ఏది అవసరమో అది ఎంచుకోవచ్చు.

First Published:  26 Sep 2021 5:26 AM GMT
Next Story