Telugu Global
National

కరోనా విషయంలో మరో 2 నెలలు కీలకం.. ఎయిమ్స్ తాజా హెచ్చరిక..

భారత్ లో రాబోయే 6 నుంచి 8 వారాలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. కొవిడ్ నియంత్రణలో రాబోయే రెండు నెలలు కీలకం అని అన్నారాయన. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ సూచనలు చేస్తున్నట్టు ప్రకటించారు. కొవిడ్ నుంచి బయటపడి పూర్వ పరిస్థితులకు వెళ్లాలంటే మరో 8 వారాలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అన్నారాయన. భారత్ లో సెకండ్ వేవ్ బలహీన పడినా.. […]

కరోనా విషయంలో మరో 2 నెలలు కీలకం.. ఎయిమ్స్ తాజా హెచ్చరిక..
X

భారత్ లో రాబోయే 6 నుంచి 8 వారాలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా. కొవిడ్ నియంత్రణలో రాబోయే రెండు నెలలు కీలకం అని అన్నారాయన. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ సూచనలు చేస్తున్నట్టు ప్రకటించారు. కొవిడ్ నుంచి బయటపడి పూర్వ పరిస్థితులకు వెళ్లాలంటే మరో 8 వారాలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అన్నారాయన.

భారత్ లో సెకండ్ వేవ్ బలహీన పడినా.. ఇంకా అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 84కోట్ల డోసుల వ్యాక్సిన్ వినియోగించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలకు పైగా ఉంది. రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నట్టుగానే ఉన్నా.. కొన్నిసార్లు పెరుగుదల కూడా కనిపిస్తోంది. డిశ్చార్జిలు తక్కవగా ఉంటే.. యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ మహమ్మారి పూర్తిగా తొలగిపోయినట్టు చెప్పలేం కానీ, ప్రస్తుతానికి థర్డ్ వేవ్ భయాలేవీ లేవని మాత్రం ప్రజల్లో ధైర్యం వచ్చేసింది. అయితే ఇలాంటి ధైర్యం వల్లే లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

పండగల సీజనే కీలకం..
కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదని హెచ్చరించిన ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్‌ గులేరియా.. దాని నుంచి బయటపడాలంటే రాబోయే పండగల సీజన్‌లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాక్సిన్‌ రోగాన్ని తీవ్రం కాకుండా చూస్తుందని, టీకా తీసుకున్నవారికి ఒకవేళ కోవిడ్‌ సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారి ద్వారా, వ్యాక్సిన్‌ తీసుకోనివారికి కోవిడ్‌ సోకితే అలాంటివారిలో తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని చెప్పారు. ఈ నేపథ్యంలో అందరూ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ప్రస్తుతం దేశంలో ఆశావహ పరిస్థితులున్నాయని, రోజురోజుకీ మహమ్మారి ప్రభావం తగ్గుతోందని, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని స్పష్టం చేశారు గులేరియా.

First Published:  25 Sep 2021 6:01 AM GMT
Next Story