Telugu Global
NEWS

కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పొలిటికల్ ఫోకస్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వరుసగా రెండోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన కేసీఆర్.. ఈ నెలలో దాదాపు సగం రోజులు హ‌స్తిన‌లోనే ఉన్నట్టు లెక్క. ఈనెల 1న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ 9వ తేదీ వరకు అక్కడే ఉండి వచ్చారు. ప్రధాని మోదీ సహా.. ఇతర కేంద్ర మంత్రుల్ని కలిసి విభజన చట్టం అమలుపై వినతిపత్రాలిచ్చారు. అయితే ప్రధానంగా కేసీఆర్ పర్యటన ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ శంకుస్థాపన, యాదాద్రి […]

కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై పొలిటికల్ ఫోకస్..
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వరుసగా రెండోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన కేసీఆర్.. ఈ నెలలో దాదాపు సగం రోజులు హ‌స్తిన‌లోనే ఉన్నట్టు లెక్క. ఈనెల 1న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ 9వ తేదీ వరకు అక్కడే ఉండి వచ్చారు. ప్రధాని మోదీ సహా.. ఇతర కేంద్ర మంత్రుల్ని కలిసి విభజన చట్టం అమలుపై వినతిపత్రాలిచ్చారు. అయితే ప్రధానంగా కేసీఆర్ పర్యటన ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ శంకుస్థాపన, యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించడం వంటి వాటి చుట్టూ తిరిగింది. ఇప్పుడిదే నెలలో ఆయన రెండోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈరోజు అసెంబ్లీ తొలిరోజు సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతారు. ఈ టూర్ 3 రోజుల్లో ముగిస్తారని తెలుస్తోంది.

రెండోసారి ఎందుకు..?
తెలంగాణలో నేటినుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల అనంతరం ఆరు నెలలకు అసెంబ్లీ కొలువుదీరబోతోంది. ఈటల రాజేందర్ రాజీనామా సహా తెలంగాణలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిన నేపథ్యంలో ఈ సారి సమావేశాలు వాడి వేడిగా సాగుతాయని అంటున్నారు. నిరుద్యోగం, వ్యవసాయం, పంట కొనుగోళ్లు, ధరణి పోర్టల్‌ సమస్య, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, శాంతిభద్రతల సమస్యలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే సమావేశాల తొలిరోజే కేసీఆర్ ఢిల్లీ ప్రయాణం పెట్టుకోవడం విశేషం. మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనుల సమీక్షపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్వహించే భేటీలో కేసీఆర్‌ పాల్గొంటారు. ఈ సమావేశంతోపాటు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు కూడా కుదిరాయి. జలశక్తి మంత్రి, కేంద్ర ఆహార మంత్రితో మీటింగ్ లకు కేసీఆర్ కి అపాయింట్ మెంట్ ఉంది.

ప్రతిపక్షాల విమర్శలు..
గతంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని.. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే విషయంపై అమిత్ షా తో చర్చించడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇప్పుడు రెండోసారి యాత్రపై కూడా కాంగ్రెస్ విమర్శలు మొదలు పెట్టింది. బీజేపీతో లాలూచీ వ్యవహారంలో ఇది ఎపిసోడ్-2 అంటున్నారు హస్తం పార్టీ నేతలు. మొత్తమ్మీద ఒకే నెలలో రెండోసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

First Published:  23 Sep 2021 9:08 PM GMT
Next Story