Telugu Global
National

ఆత్మహత్య చేసుకున్నా కొవిడ్ పరిహారం.. కుటుంబానికి రూ.50వేలు..

కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించి, దాన్ని రాష్ట్రాలే చెల్లించాలని సుప్రీంకోర్టుకి చెప్పిన కేంద్ర ప్రభుత్వం, గురువారం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. కొవిడ్ సోకిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని అఫిడవిట్ లో స్పష్టం చేసింది. పరిహారాన్ని రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్)కింద చెల్లించాలని రాష్ట్రాలకు సూచించింది. కరోనా పాజిటివ్‌ రిజల్ట్ వచ్చిన 30 రోజుల లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబ సభ్యులు కొవిడ్ […]

ఆత్మహత్య చేసుకున్నా కొవిడ్ పరిహారం.. కుటుంబానికి రూ.50వేలు..
X

కొవిడ్ తో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించి, దాన్ని రాష్ట్రాలే చెల్లించాలని సుప్రీంకోర్టుకి చెప్పిన కేంద్ర ప్రభుత్వం, గురువారం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. కొవిడ్ సోకిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని అఫిడవిట్ లో స్పష్టం చేసింది. పరిహారాన్ని రాష్ట్ర విపత్తు స్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్)కింద చెల్లించాలని రాష్ట్రాలకు సూచించింది.

కరోనా పాజిటివ్‌ రిజల్ట్ వచ్చిన 30 రోజుల లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబ సభ్యులు కొవిడ్ పరిహారం పొందేందుకు అర్హులని కేంద్రం తెలిపింది. అయితే మరణ ధృవీకరణ పత్రాల జారీపై నెలకొనే వివాదాలపై ఇప్పుడు సుప్రీంకోర్టు, కేంద్రం దృష్టిపెట్టాయి. కొవిడ్ తో మరణించిన వారికి సంబంధించి ప్రత్యేకంగా మరణ ధృవీకరణ పత్రాలు జారీచేయాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలిచ్చింది. అయితే ఇంకా అక్కడక్కడ దీనిపై వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాల పరిష్కారానికి అక్టోబరు 4న మరి కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీం వెల్లడించింది. జిల్లాల్లోని ఫిర్యాదుల పరిష్కార కమిటీలకు ఆసుపత్రుల నుంచి మరణించిన వ్యక్తుల రికార్డులను తెప్పించుకొనే అధికారాలను తమ ఆదేశాల ద్వారా కల్పిస్తామని తెలిపింది. మృతుల బంధువులు జిల్లాల్లోని ఫిర్యాదుల పరిష్కార కమిటీని కలిసి కనీస సాక్ష్యంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నివేదికను సమర్పించవచ్చని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది.

దివ్యాంగులకు మొబైల్ వ్యాక్సిన్..
వృద్ధులకైనా, ఇతర అనారోగ్యం ఉన్నవారికైనా.. ఇప్పటి వరకూ టీకా డోర్ డెలివరీ అధికారికంగా మొదలు కాలేదు. ఇకపై కదల లేని స్థితిలో ఉన్నవారికి, వికలాంగులకోసం మొబైల్ వ్యాక్సినేషన్ బృందాలను కేంద్రం తెరపైకి తీసుకొస్తోంది. వీరికి ఇళ్లవద్దనే టీకాలు ఇస్తారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది.

First Published:  23 Sep 2021 9:32 PM GMT
Next Story