Telugu Global
NEWS

ఆ ఇద్దరికీ మైక్ కట్.. తుది నిర్ణయం స్పీకర్ చేతుల్లో..

టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడికి శాసన సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని ఏపీ శాసన సభాహక్కుల సంఘం తీర్మానించింది. ప్రస్తుత శాసన సభా కాలం పూర్తయ్యే వరకు దీన్ని అమలు చేయాలని సభాహక్కుల సంఘం చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫారసు చేస్తూ లేఖ రాశారు. సభా హక్కుల సంఘం తీర్మానాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు ఉంచుతారు, దీనిపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు. సభలో తప్పుడు సమాచారం […]

ఆ ఇద్దరికీ మైక్ కట్.. తుది నిర్ణయం స్పీకర్ చేతుల్లో..
X

టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడికి శాసన సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని ఏపీ శాసన సభాహక్కుల సంఘం తీర్మానించింది. ప్రస్తుత శాసన సభా కాలం పూర్తయ్యే వరకు దీన్ని అమలు చేయాలని సభాహక్కుల సంఘం చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫారసు చేస్తూ లేఖ రాశారు. సభా హక్కుల సంఘం తీర్మానాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు ఉంచుతారు, దీనిపై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు.

సభలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకే..
శాసనసభలో చర్చ సందర్భంగా మద్యం దుకాణాల సంఖ్యపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తప్పుడు సమాచారం చూపిస్తూ ప్రభుత్వంపై అపనిందలు వేశారంటూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సభా హక్కుల సంఘానికి గతంలో ఫిర్యాదు చేశారు. మరో ఎమ్మెల్యే రామానాయుడు పింఛన్ల సంఖ్య విషయంలో తప్పుడు లెక్కలు చూపారంటూ.. సీఎం జగన్ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన సభా హక్కుల సంఘం వారిపై చర్యలకు తీర్మానం చేసింది. మరోవైపు స్పీకర్ పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై గతంలోనే సభా హక్కుల సంఘం విచారణ చేపట్టింది. అచ్చెన్నాయుడు క్షమాపణతో ఆ వివాదం సద్దుమణిగింది. తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించారనే కారణంతో అచ్చెన్నాయుడు, రామానాయుడికి మైక్ కట్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మరో ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కూడా ఇదే ఆరోపణలతో విచారణ జరిగింది. అయితే ఆయన నేరుగా సభా హక్కుల సంఘం ముందుకు హాజరు కాలేదు, తాను అందుబాటులో లేనంటూ గతంలో సమాచారమిచ్చారు. ఆయన వివరణ సహేతుకం కాకపోతే ధిక్కరణ చర్యలు తీసుకుంటామన్నారు సభా హక్కుల సంఘం చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి.

నిమ్మగడ్డపై కొనసాగిన విచారణ..
స్థానిక ఎన్నికల సందర్భంగా.. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇంటినుంచి బయటకు రాకూడదంటూ అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులపై కూడా సభా హక్కుల సంఘం విచారణ చేపట్టింది. అప్పట్లో ఆ ఉత్తర్వులను నిలువరించేలా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మంత్రులు, ఆ తర్వాత సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టగా.. తాను అలాంటి ఉత్తర్వులేవీ ఇవ్వలేదని నిమ్మగడ్డ బదులిచ్చారు. అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉంటే ఆ వివరాలు పంపాలని కోరారు. ఈమేరకు సదరు వివరాలు నిమ్మగడ్డకు పంపించేందుకు సభా హక్కుల సంఘం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు దగ్గర్లో లేకపోతే త్వరలో మరో సమావేశం ఏర్పాటుచేసి విచారణలన్నింటినీ ముగిస్తామని చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

First Published:  21 Sep 2021 8:53 PM GMT
Next Story