Telugu Global
National

బెంగాల్ లో బీజేపీ దిద్దుబాటు చర్యలు..

పశ్చిమ బెంగాల్ లో భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఓడించాలని, ఆమెను సీఎం కుర్చీకి దూరం చేయాలని సీరియస్ గా ట్రైచేస్తోంది బీజేపీ. అయితే తాము అనుకున్నదొకటి, అయింది మరొకటి అన్నట్టు ఉంది అక్కడ బీజేపీ పరిస్థితి. ఇప్పటికే బెంగాల్ లో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ.. బీజేపీ నుంచి టీఎంసీ గూటికి వెళ్లిపోయారు. ఇకపై ఇంకెంతమంది వెళ్తారో అనే అనుమానం వారిలో ఉంది. ఈ క్రమంలో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. […]

బెంగాల్ లో బీజేపీ దిద్దుబాటు చర్యలు..
X

పశ్చిమ బెంగాల్ లో భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఓడించాలని, ఆమెను సీఎం కుర్చీకి దూరం చేయాలని సీరియస్ గా ట్రైచేస్తోంది బీజేపీ. అయితే తాము అనుకున్నదొకటి, అయింది మరొకటి అన్నట్టు ఉంది అక్కడ బీజేపీ పరిస్థితి. ఇప్పటికే బెంగాల్ లో నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ.. బీజేపీ నుంచి టీఎంసీ గూటికి వెళ్లిపోయారు. ఇకపై ఇంకెంతమంది వెళ్తారో అనే అనుమానం వారిలో ఉంది. ఈ క్రమంలో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బెంగాల్ బీజేపీ చీఫ్ ని మార్చేసింది.

బెంగాల్ బీజేపీ చీఫ్ గా ఉన్న దిలీప్ ఘోష్, అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు కదిలారు. టీఎంసీకి ముచ్చెమటలు పోయించారు, అధికారం దక్కకపోయినా అక్కడ బీజేపీ చేసిన పోరాటం మాత్రం తక్కువ కాదు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు టీఎంసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీవైపు ఆకర్షించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు చేజారుతుంటే మాత్రం ఆయన చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దిలీప్ ఘోష్ నాయకత్వంపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన్ను మార్చేసింది.

సువేందు అధికారితో మనస్పర్థలే కారణమా..?
ఎమ్మెల్యేలు చేజాతురున్నారనే విషయాన్ని పక్కనపెడితే ప్రస్తుతం బెంగాల్ లో బీజేపీ శాసన సభాపక్షనేతగా ఉన్న సువేందు అధికారితో దిలీప్ ఘోష్ కి పొసగడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోటే దిలీప్ పై అధిష్టానం వేటు వేసిందని అంటున్నారు. ఆయన స్థానంలో ఎంపీ సుకంత మజుందర్ ను బీజేపీ బెంగాల్ చీఫ్ గా నియమించారు. సుకంత మజుందర్ తో సువేందు అధికారికి సత్సంబంధాలున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరి జోడీ బెంగాల్ లో బీజేపీని మరింత బలపరుస్తుందని, ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుతుందని అధిష్టానం అంచనా వేస్తోంది.

ఫోకస్ అంతా భవానీపూర్ పైనే..
ప్రస్తుతం బీజేపీ అధిష్టానం సహా, బెంగాల్ బీజేపీ నాయకుల ఫోకస్ అంతా భవానీపూర్ ఉప ఎన్నికలపైనే ఉంది. మమతా బెనర్జీని ఓడించడానికి ఆ పార్టీ కిందామీదా పడుతోంది. అయితే భవానీపూర్.. మమతా సొంత నియోజకవర్గం కావడం, అక్కడ టీఎంసీకి మంచి పట్టు ఉండటంతో బీజేపీ వ్యూహాలు ఫలించాలే కనిపించడంలేదు. మమతాపై ఉన్న కేసుల వివరాలు అఫిడవిట్ లో పేర్కొనలేదని, ఆమె నామినేషన్ తిరస్కరించాలంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు లేఖలు రాశారు బీజేపీ నేతలు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక గెలుపుకోసం కేంద్ర మంత్రులంతా ప్రచారానికి తరలి వస్తారని తెలుస్తోంది. ఈలోగా.. ఇటు రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చేశారు.

First Published:  20 Sep 2021 11:00 PM GMT
Next Story