Telugu Global
Others

సీడ్ లెస్ పుచ్చకాయలు.. ఎప్పుడైనా రుచి చూశారా..?

వేసవి తాపానికి మంచి విరుగుడు పుచ్చకాయ. పుచ్చకాయ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలతోపాటు నీరు కూడా తగినంత అందుతుంది. గతంలో వేసవికాలంలో మాత్రమే పుచ్చకాయలు దొరికేవి. ప్రస్తుతం అన్ని సీజన్లలోనూ పుచ్చకాయలు పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక పుచ్చకాయలకు మంచి మార్కెట్. అయితే పుచ్చకాయలు తినాలంటే విత్తనాలు పడేసేందుకు మార్గం కూడా వెదుక్కోవాలి. ఈ ఇబ్బందిని తీర్చే కొత్తరకం పుచ్చకాయలు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి సీడ్ లెస్ పుచ్చకాయలు. విత్తనాలు లేకుండానే పుచ్చకాయల్ని పండిస్తున్నారు కేరళ […]

సీడ్ లెస్ పుచ్చకాయలు.. ఎప్పుడైనా రుచి చూశారా..?
X

వేసవి తాపానికి మంచి విరుగుడు పుచ్చకాయ. పుచ్చకాయ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలతోపాటు నీరు కూడా తగినంత అందుతుంది. గతంలో వేసవికాలంలో మాత్రమే పుచ్చకాయలు దొరికేవి. ప్రస్తుతం అన్ని సీజన్లలోనూ పుచ్చకాయలు పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక పుచ్చకాయలకు మంచి మార్కెట్. అయితే పుచ్చకాయలు తినాలంటే విత్తనాలు పడేసేందుకు మార్గం కూడా వెదుక్కోవాలి. ఈ ఇబ్బందిని తీర్చే కొత్తరకం పుచ్చకాయలు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి సీడ్ లెస్ పుచ్చకాయలు. విత్తనాలు లేకుండానే పుచ్చకాయల్ని పండిస్తున్నారు కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఇకపై పుచ్చకాయ తినేటప్పుడు విత్తనాలు ఎక్కడ పడేయాలా అని ఆలోచించక్కర్లేదు, కాయను కోయడం, తినడం.. అంతే.

హైబ్రిడ్ పుచ్చకాయలపై కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిశోధనలు సాగించింది. క్రిస్టెండ్ షోనిమా, స్వర్ణ అనే రెండు రకాల సీడ్ లెస్ వంగడాలను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. త్రిశూర్ లోని వెల్లనిక్కరలో ఉన్న కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీ ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా వీటిని సాగు చేస్తున్నారు. అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు.

ఎకరాకి 50వేలు ఖర్చు.. కోటీ 20లక్షలు ఆదాయం..
అగ్రికల్చర్ యూనివర్శిటీలో ఉన్న పాలీ హౌస్ లో ఈ సీడ్ లెస్ పుచ్చకాయల్ని పండిస్తున్నారు. పాలీ హౌస్ సెటప్ లోనే కాకుండా.. సాధారణ పొలాల్లో కూడా వీటిని పండించవచ్చని చెబుతున్నారు యూనివర్శిటీ వెజిటబుల్ సైన్స్ డిపార్ట్ మెంట్ హెడ్ ప్రదీప్ కుమార్. సాగు ఖర్చు ఎకరాకి 50వేల రూపాయలు అవుతుందని చెబుతున్నారాయన. ఒక్కో మొక్క నుండి ఏడాదికి మూడు నాలుగు కాయలు దిగుబడి అవుతాయి. ఒక్కో పుచ్చకాయ బరువు రెండున్నర కేజీలనుంచి 3 కేజీల వరకు ఉంటుంది. ఆ లెక్కన నాలుగు నెలల్లో ఎకరాకి కోటీ 20లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చని రైతులకు భరోసా ఇస్తున్నారు శాస్త్రవేత్తలు.

సీడ్ లెస్ పంటకు విత్తనాలు ఎలా..?
సీడ్ లెస్ పుచ్చకాయలు సాగు చేయడానికి విత్తనాలను ప్రస్తుతం కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీ సరఫరా చేస్తోంది. ఒక్కో విత్తనం ఖరీదు 1రూపాయి మాత్రమే. కేజీ ప్యాకెట్ లో 30వేల విత్తనాలుంటాయి. ఆన్ లైన్ లో కూడా వీటిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం మన దేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకలో పుచ్చకాయల సాగు ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ కేవలం విత్తనాలతో కూడిన సంప్రదాయ పుచ్చకాయల్ని మాత్రమే పండిస్తున్నారు. సీడ్ లెస్ పుచ్చకాయలవైపు రైతులు దృష్టిమళ్లిస్తే మరింత ఆదాయం సంపాదించొచ్చని సలహా ఇస్తున్నారు కేరళ అగ్రికల్చర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు.

First Published:  21 Sep 2021 6:59 AM GMT
Next Story