Telugu Global
NEWS

ఫైబర్ నెట్ వ్యవహారంలో తొలి అరెస్ట్..

ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారానికి సంబంధించి 2 వేల కోట్ల రూపాయల కుంభకోణంగా భావిస్తున్న కేసులో సీఐడీ అధికారులు తొలి అరెస్ట్ చూపించారు. సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ-2గా ఉన్న ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఇన్ క్యాప్) సీఎండీ కె.సాంబశివరావుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 1 వరకు కోర్డు రిమాండ్ విధించగా ఆయన్ను మచిలీపట్నం సబ్ జైలుకి తరలించారు. సాంబశివరావు ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ గా వ్యవహరించిన […]

ఫైబర్ నెట్ వ్యవహారంలో తొలి అరెస్ట్..
X

ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారానికి సంబంధించి 2 వేల కోట్ల రూపాయల కుంభకోణంగా భావిస్తున్న కేసులో సీఐడీ అధికారులు తొలి అరెస్ట్ చూపించారు. సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ-2గా ఉన్న ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఇన్ క్యాప్) సీఎండీ కె.సాంబశివరావుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 1 వరకు కోర్డు రిమాండ్ విధించగా ఆయన్ను మచిలీపట్నం సబ్ జైలుకి తరలించారు.

సాంబశివరావు ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ గా వ్యవహరించిన సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తం 2వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ ఆరోపించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై విచారణ మొదలైంది. ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది. ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ హోదాలో సాంబశివరావు టెరాసాఫ్ట్‌ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, ఆ సమయం లో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ గవర్నెన్స్ అథారిటీ మాజీ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ కె.సాంబశివరావు, టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కంపెనీ, దాని డైరెక్టర్లపై కేసులు పెట్టారు.

గ్రామాలకు ఇంటర్నెట్ చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకంలో భాగంగా.. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ పేరుతో డిష్ కనెక్షన్ తో పాటు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులు మొదలయ్యాయి. ఈ క్రమంలో సెట్ టాప్ బాక్స్ ల టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా టెరా సాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణ. అప్పటికే ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉండగా.. నిబంధనలు మార్చి బ్లాక్ లిస్ట్ లోనుంచి హడావిడిగా ఆ కంపెనీపేరు తొలగించి లాంఛనం పూర్తి చేశారని ఆరోపణలున్నాయి. టెరాసాఫ్ట్‌ ఫేక్‌ ఎక్స్‌ పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ద్వారా ఈ కాంట్రాక్ట్ పొందిందని, ఆ విషయం తెలిసి కూడా ఎండీ హోదాలో సాంబశివరావు దాన్ని ఆమోదించారని సీఐడీ విచారణలో తేలింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.

ఏఒక్కరినీ వదిలిపెట్టరు..
సీఐడీ విచారణ తర్వాత కుంభకోణానికి బాధ్యులైనవారంతా బయటకొస్తారని అన్నారు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. వారిలో ఐఏఎస్ అధికారులు కూడా ఉండొచ్చని అన్నారు. అర్హతలేని టెరా సాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్ట్‌ లు ఇచ్చేప్పుడు అప్పటి మంత్రి మండలి ఏం చేసిందని ప్రశ్నించారు. ఈ వ్యవహారం అప్పటి ఆర్ధిక మంత్రి పరిశీలనలోకి రాకుండానే జరిగిందా అని విమర్శించారు. ప్రస్తుతం ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్లు పెంచే ప్రయత్నం చేస్తున్నామని, ట్రిపుల్ ప్లే నెట్వర్క్ బాక్స్ లు త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు గౌతమ్ రెడ్డి

First Published:  18 Sep 2021 10:13 PM GMT
Next Story