Telugu Global
Cinema & Entertainment

అఖండ పాటల సందడి షురూ

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం`అఖండ` మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టింది చిత్ర యూనిట్‌. దానిలో భాగంగా అఖండ ఫ‌స్ట్ సింగిల్ `అడిగా అడిగా` ను రిలీజ్ చేశారు. ఈ పాట బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కు ఒకరిపట్ల ఇంకొకరి ఎంత ప్రేమ ఉందో చూపించేలా సాగింది. […]

అఖండ పాటల సందడి షురూ
X

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్
చిత్రం'అఖండ' మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను మొద‌లుపెట్టింది చిత్ర యూనిట్‌. దానిలో భాగంగా అఖండ ఫ‌స్ట్ సింగిల్ 'అడిగా అడిగా' ను రిలీజ్ చేశారు.

ఈ పాట బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ కు ఒకరిపట్ల ఇంకొకరి ఎంత ప్రేమ ఉందో చూపించేలా సాగింది. ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న త‌మ‌న్ ఈ మెలోడి గీతం కోసం ఒక అద్భుత‌మైన ట్యూన్ ను అందించాడు. ఎస్పీ చరణ్, ఎంఎల్ శ్రుతి ఈ పాటను శ్రావ్యంగా పాడారు. కళ్యాణ్ చక్రవర్తి మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట సంగీత ప్రియుల్ని అల‌రిస్తుంది.

ఇక బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జోడి స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. కొరియోగ్రఫీ
అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. బోయపాటి శ్రీను సినిమాలంటే కచ్చితంగా మంచి మెలోడీ పాట ఉండాల్సిందే. ఆ కోవలో త‌ప్ప‌కుండా 'అడిగా అడిగా' పాట‌ చేరుతుంది.

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి అఖండ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

First Published:  19 Sep 2021 8:13 AM GMT
Next Story