Telugu Global
Health & Life Style

బరువు తగ్గించే గ్రెయిన్స్ ఇవే..

మనలో చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తీసుకునే ఆహారం అనేది బరువు తగ్గడంలో అన్నింటికంటే ముఖ్య పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ తినే ఆహారంలో ఎక్కువ శాతం ఏముంటుంది అనేది గ్రహించాలి. గింజలు(గ్రెయిన్స్) అనేవి మనదేశంలో ప్రధానమైన ఆహార వనరుగా ఉంటూ వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారంలో గింజల పాత్ర ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో ఎలాంటి గింజలు ఉంటున్నాయి అనేది గమనించుకోవాలి. గింజల్లో కొన్ని […]

బరువు తగ్గించే గ్రెయిన్స్ ఇవే..
X

మనలో చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తీసుకునే ఆహారం అనేది బరువు తగ్గడంలో అన్నింటికంటే ముఖ్య పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ తినే ఆహారంలో ఎక్కువ శాతం ఏముంటుంది అనేది గ్రహించాలి.

గింజలు(గ్రెయిన్స్) అనేవి మనదేశంలో ప్రధానమైన ఆహార వనరుగా ఉంటూ వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారంలో గింజల పాత్ర ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో ఎలాంటి గింజలు ఉంటున్నాయి అనేది గమనించుకోవాలి.

గింజల్లో కొన్ని రకాలు బరువు తగ్గించేందుకు హెల్ప్ చేస్తే , మరికొన్ని రకాల గింజలు బరువుని పెంచేందుకు తోడ్పడతాయి. అందుకే వెయిట్ లాస్ కోసం డైట్‌లో ఎలాంటి గ్రెయిన్స్‌ను చేర్చుకోవాలి? ఎయే గ్రెయిన్స్‌ను అవాయిడ్ చేయాలో ఓసారి చూద్దాం.

బరువుని తగ్గించుకోవడం కోసం తక్కువ కేలరీలు కలిగి ఉంటూ ఎక్కువ పోషకాలు అందించే గ్రెయిన్స్‌ను తీసుకోవాలి. హెల్దీ కార్బోహైడ్రేట్స్‌ను అందిస్తూ.. ఫైబర్ అధికంగా ఉండే గ్రెయిన్స్‌ను ఎంచుకోవాలి.

బార్లీ (జౌ)
బార్లీ ఒక పురాతనమైన గ్రెయిన్. బార్లీ మనకు గింజలు లేదా పిండి రూపంలో లభిస్తుంది. ఇది ఫైబర్ అధికంగా ఉండే ధాన్యం. ఇది బీటా-గ్లూకాన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఉండదు. అలాగే కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్, రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో కూడా ఇది సాయపడుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ ఒక మంచి ఆప్షన్. బార్లీ పిండిని ఉడికించి తినొచ్చు లేదా బార్లీ నీటిని కూడా తాగొచ్చు.

మిల్లెట్స్ (రాగి)
తక్కువ కేలరీలు కలిగి ఉంటూ.. ఎక్కువ ఫైబర్‌‌ను అందించే ఫుడ్స్‌లో మిల్లెట్స్ బెస్ట్ ఆప్షన్. వీటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ పొట్టను ఎప్పుడూ నిండుగా ఉంచుతూ ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో గ్లూటెన్ ఉండదు. డయాబెటిస్, రక్తహీనతను తగ్గించేందుకు ఇది బాగా సాయపడతుంది. ఇందులో విటమిన్ డి అలాగే కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే మిల్లెట్స్.. వెయిట్ లాస్‌కు బెస్ట్ ఆప్షన్స్.

బ్రౌన్ రైస్
బరువు తగ్గడం మీ టార్గెట్ అయితే బ్రౌన్ రైస్ అనేది మీకొక బెస్ట్ ఛాయిస్ అవ్వగలదు. ఇది సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ఫైటిక్ యాసిడ్, పాలీఫెనాల్స్.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచేందుకు సాయపడతాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొవ్వును కరిగించడంలో కూడా ఇది తోడ్పడుతుంది. వీటితో పాటు బ్రౌన్ రైస్ లో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ప్రోటీన్, బీ -గ్రూప్ విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. సెలీనియం ఎక్కువగా ఉండే అతి కొద్ది ఆహారాల్లో ఇది ఒకటి.

క్వినోవా (Quinoa)
బరువుని తగ్గించే మరో బెస్ట్ గ్రెయిన్.. క్వినోవా. ఇది ఎక్కువ శాతం ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. 100 గ్రాముల క్వినోవాలో 14 గ్రాముల ప్రోటీన్లు, 7 గ్రాముల ఫైబర్ ఉంటాయి. క్వినోవాను సలాడ్లతో కలిపి తీసుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్ లేని ఆహార ధాన్యం. క్వినోవాలో కేలరీలు కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. తద్వారా ఇది రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేయగలదు.

ఓట్స్
బరువు తగ్గడం కోసం చాలామంది ఎంచుకునే ఆహారం ఓట్స్. ఇవి తక్కువ కేలరీలను కలిగి ఉంటూ జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. ఈ సూపర్ ఫుడ్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో షుగర్ , కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడానికి సాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఇకపోతే బరువు తగ్గాలనుకునే వారు అవాయిడ్ చేయాల్సిన గ్రెయిన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

పాలిష్డ్ గ్రెయిన్స్
ఎక్కువగా శుద్ధి చేసిన ధాన్యాలు కేవలం కేలరీలను మాత్రమే కలిగి ఉంటాయి. వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు. వైట్ రైస్ ఇలాంటిదే.
వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్, కేలరీలు అధికంగా ఉంటాయి. ఫైబర్ తక్కువగా ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే చక్కెరగా మారుతుంది. అందుకే ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఏమాత్రం మంచి ఆప్షన్ కాదు.

గోధుమలు
గోధుమలు కూడా బరువు తగ్గించడంలో సాయపడవు. ఇది బరువు పెరగడానికి ఒక సూపర్ ఫుడ్. ఇందులో ఫైబర్‌‌తో పాటు కొవ్వు కూడా ఉంటుంది. కేలరీలు కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. దీని గ్లిసమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. అందుకే బరువు తగ్గాలనుకునే వారు గోధుమలను ఎంచుకోకపోవడమే మంచిది.

First Published:  18 Sep 2021 1:56 AM GMT
Next Story