Telugu Global
Cinema & Entertainment

మాస్ట్రో మూవీ రివ్యూ

నటీనటులు: నితిన్, తమన్నా, నభా నటేష్, నరేష్, జిషుసేన్ గుప్తా, రచ్చ రవి తదితరులు సంగీతం : మహతి సాగర్ కెమెరామెన్ : యువరాజ్ నిర్మాణం : శ్రేష్ట్ మూవీస్ నిర్మాతలు : సుధాకర్ రెడ్డి , నిఖితా రెడ్డి దర్శకత్వం : మేర్లపాక గాంధి రేటింగ్: 2.5/5 రీమేక్ తీసినప్పుడు రెండు ఇబ్బందులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. మక్కికిమక్కి తీస్తే కలర్ జిరాక్స్ అంటారు. మార్పుచేర్పులు చేస్తే చెడగొట్టారని అంటారు. అందుకేనేమో మాస్ట్రో మేకర్స్ కొంత […]

మాస్ట్రో మూవీ రివ్యూ
X

నటీనటులు: నితిన్, తమన్నా, నభా నటేష్, నరేష్, జిషుసేన్ గుప్తా, రచ్చ రవి తదితరులు
సంగీతం : మహతి సాగర్
కెమెరామెన్ : యువరాజ్
నిర్మాణం : శ్రేష్ట్ మూవీస్
నిర్మాతలు : సుధాకర్ రెడ్డి , నిఖితా రెడ్డి
దర్శకత్వం : మేర్లపాక గాంధి
రేటింగ్: 2.5/5

రీమేక్ తీసినప్పుడు రెండు ఇబ్బందులు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. మక్కికిమక్కి తీస్తే కలర్ జిరాక్స్ అంటారు. మార్పుచేర్పులు చేస్తే చెడగొట్టారని అంటారు. అందుకేనేమో మాస్ట్రో మేకర్స్ కొంత కాపీ కొట్టి, కొంత మార్చారు. దీంతో కాపీ కొట్టింది బాగుంది, మార్పుచేర్పులు బాగాలేవు. మాస్ట్రో గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఇంతే.

బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన అంధాధూన్ సినిమాకు రీమేక్ గా వచ్చింది మాస్ట్రో. అంధాధూన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. అలాంటి సినిమాను చెడగొట్టకూడదనే ఉద్దేశంతో దాదాపు 90శాతం మక్కికిమక్కి దించేశారు. ఈ ప్రయత్నం బాగుంది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఏ రేంజ్ లో ఉన్నదున్నట్టు దించాడో చెప్పడానికి సినిమా ప్రారంభంలో వచ్చిన 2-3 ఎపిసోడ్స్ ఉదాహరణగా నిలుస్తాయి.

ఇలా నిజాయితీగా రీమేక్ చేసి మెప్పు పొందిన మేకర్స్.. అదే టైమ్ లో రాంగ్ కాస్టింగ్ పరంగా విమర్శలు
ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సినిమాకు అత్యంత కీలకమైన లేడీ విలన్ పాత్ర కోసం తమన్నను
తీసుకున్నారు. తన అనుభవం అంతా రంగరించి తమన్న చక్కగా నటించింది. కానీ ఈ పాత్రకు ఆమె
పనికిరాదు. కాస్త వయసులో పెద్దగా ఉన్న హీరోయిన్ అయితే బాగుండేది. చూడ్డానికి నితిన్-తమన్న ఒకే
వయసు అనిపించేలా ఉన్నారు. ఒరిజినల్ లో మాత్రం ఆయుష్మాన్ ఖురానా-టబు చక్కగా సూట్ అయ్యారు. దీనికితోడు తమన్న చెప్పిన డబ్బింగ్ కూడా ఆ పాత్రకు సెట్ కాలేదు.

ఇక కథలోకి వస్తే.. హీరో అంధుడిగా నటిస్తాడు. మంచి పియానో ప్లేయర్. అతడ్ని చూసి హీరోయిన్ నభా
ప్రేమలో పడుతుంది. నభా రెస్టారెంట్ లోనే హీరో పియానో ప్లే చేస్తుంటాడు. సీనియర్ నటుడు నరేష్ కు హీరో పెర్ఫార్మెన్స్ నచ్చుతుంది. తన పెళ్లి రోజు కోసం తన అపార్ట్ మెంట్ లో హీరోతో కచేరీ పెట్టించాలని
అనుకుంటాడు. అలా తన భార్య తమన్నకు సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు.

నరేష్ కోరిక మేరకు హీరో అపార్ట్ మెంట్ కు వస్తాడు. తమన్న వచ్చి తలుపు తీస్తుంది. హీరో పియానో
వాయించడం మొదలుపెడతాడు. అంతలోనే తమన్న బాయ్ ఫ్రెండ్ గదిలోంచి బయటకొస్తాడు. ఇద్దరూ కలిసి నరేష్ మృతదేహాన్ని బయటకులాగుతారు. ఆ సీన్ హీరో చూస్తాడు. కానీ రియాక్ట్ అవ్వలేడు, ఎందుకంటే అతడు అంధుడు కదా. అలా ఆ ఇంటి నుంచి బయటపడిన హీరో, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. కంప్లయింట్ ఇద్దాం అనుకున్న టైమ్ కు తమన్న ప్రియుడే పోలీస్ అని తెలుస్తుంది. అదే టైమ్ లో తమన్నకు, ఆమె ప్రియుడికి కూడా హీరో కంటిచూపుపై అనుమానం వస్తుంది. చివరికి హీరో తమన్న నుంచి తప్పించుకున్నాడా లేదా.. తను గుడ్డివాడుగా ఎందుకు నటిస్తున్నాడు అనేది బ్యాలెన్స్ కథ.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ సినిమాలో లేడీ విలన్ పాత్రకు తమన్న సరిపోలేదు. మిగతా పాత్రలన్నీ బాగా సింక్ అయ్యాడు. అంధుడిగా నితిన్ చక్కగా నటించాడు. కానీ ఒరిజినల్ వెర్షన్ తో పోల్చి చూస్తే, నితిన్ చేసింది సగమే అని చెప్పాలి. నభా నటేష్ అయితే ఘోరం. ఒరిజినల్ వెర్షన్ లో రాధిక ఆప్టే చేసిన దాంట్లో సగం కూడా చేయలేదు. పైపెచ్చు ఆమె చాలా డీగ్లామరైజ్డ్ గా కనిపించింది. ఇలా హీరోయిన్లు ఇద్దరూ మాస్ట్రోకు మైనస్ అయ్యారు. నరేష్, రచ్చ రవి, మంగ్లీ, జిషు, శ్రీముఖి తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ గా సినిమా బాగుంది. యువరాజ్ కెమెరా పనితనం బాగుంది. మంచి లైటింగ్ సెట్ చేశాడు. డార్క్ కామెడీ థ్రిల్లర్ కి కావాల్సిన రీరికార్డింగ్ మొత్తాన్ని మహతిస్వరసాగర్ సమకూర్చి పెట్టాడు. వీళ్లిద్దరి వర్క్ హైలెట్ అయింది. దర్శకుడిగా మేర్లపాక గాంధీ చేసిందేం లేదు. మక్కికిమక్కి దించడంలో వంద శాతం సక్సెస్ అయ్యాడు. అయితే అతడు చేసిన మార్పులు మెప్పించవు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ క్లిక్ అవ్వలేదు. బహుశా.. ఒరిజినల్ వెర్షన్ చూడని వాళ్లకు నచ్చుతుందేమో.

ఓవరాల్ గా చెప్పాలంటే.. అంధాధూన్ చూడని ప్రేక్షకులకు మాస్ట్రో నచ్చుతుంది. ఒరిజినల్ వెర్షన్ చూసిన ప్రేక్షకులకు మాత్రం మాస్ట్రో అంతగా నచ్చడు.

First Published:  17 Sep 2021 8:01 AM GMT
Next Story