Telugu Global
National

నామినేషన్ నుంచే మమతలో టెన్షన్..

పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ కచ్చితంగా విజయం సాధించాలి. లేకపోతే ఆమె సీఎం సీటు కిందకే నీళ్లు వచ్చేస్తాయి. శాసన మండలి కూడా లేని బెంగాల్ లో మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, కచ్చితంగా తన అనుచరులెవరికైనా మమత సీఎం సీటు అప్పగించాల్సిన అవసరం వస్తుంది. అయితే అన్ని లెక్కలూ పక్కాగా వేసుకునే ఆమె భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఆమెకోసం టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా చేసి మరీ ఆ […]

నామినేషన్ నుంచే మమతలో టెన్షన్..
X

పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ కచ్చితంగా విజయం సాధించాలి. లేకపోతే ఆమె సీఎం సీటు కిందకే నీళ్లు వచ్చేస్తాయి. శాసన మండలి కూడా లేని బెంగాల్ లో మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి, కచ్చితంగా తన అనుచరులెవరికైనా మమత సీఎం సీటు అప్పగించాల్సిన అవసరం వస్తుంది. అయితే అన్ని లెక్కలూ పక్కాగా వేసుకునే ఆమె భవానీపూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. ఆమెకోసం టీఎంసీ ఎమ్మెల్యే రాజీనామా చేసి మరీ ఆ సీటుని అధినేత్రికి త్యాగం చేశారు.

నామినేషన్ తిరస్కరిస్తారా..?
సీఎం హోదాలో ఉన్న మమత ఓడిపోతారని ఎవరూ అనుకోరు కానీ, అదే సెంటిమెంట్ గత ఎన్నికల్లో ఫలించలేదు కదా అనే అనుమానం కూడా ఆమెను, ఆమె అనుచరగణాన్ని వెంటాడుతోంది. అయితే అంతకంటే ముందే మమతను టెన్షన్ పెడుతున్నారు బీజేపీ నేతలు. భవానీపూర్‌ ఉప ఎన్నికకు మమతా బెనర్జీ దాఖలు చేసిన నామినేషన్‌ లో ఆమెపై ఉన్న క్రిమినల్‌ కేసులను వెల్లడించలేదని, అందువల్ల ఆమె నామినేషన్‌ తిరస్కరించాలంటూ ఎన్నికల కమిషన్‌ కు బీజేపీ లేఖ రాసింది. బీజేపీ తరఫున మమత ప్రత్యర్థిగా బరిలో దిగుతున్న ప్రియాంక తిబ్రేవాల్‌, నియోజకవర్గ బీజేపీ ఎన్నికల చీఫ్ ఏజెంట్ ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఆ కేసులు మమతపై ఉన్నవి కాదనేది టీఎంసీ నేతల వాదన. మమతా బెనర్జీ పేరుతో ఉన్న మరో మహిళపై ఆ కేసులు నమోదయ్యాయని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ కూడా గత ఎన్నికల సందర్భంలో స్పష్టం చేసిందని వారు అంటున్నారు.

ఇప్పటికే బెంగాల్ లో టీఎంసీ నేతల్ని కేసులతో ముప్పతిప్పలు పెడుతున్న బీజేపీ.. మమతా బెనర్జీకి భవానీపూర్ లో అడ్డుకట్ట వేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతుందని తెలుస్తోంది. కేంద్ర పెద్దలంతా ఈ ఎన్నికల ప్రచారంకోసం వస్తారు. కేంద్రంలో తమకున్న అధికారాన్ని ఉపయోగించుకుని ఎన్ని జిమ్మిక్కులైనా చేస్తారు. ఈ ఉప ఎన్నిక మమతా బెనర్జీకి ఎంత ముఖ్యమో.. బీజేపీకి కూడా అంతే అవసరం. ఎమ్మెల్యేగా గెలవలేని మమతా బెనర్జీ పార్టీకి బెంగాల్ ని పాలించే అర్హత లేదని కూడా బీజేపీ ప్రచారం చేయొచ్చు. అంతే కాదు, మమత సీఎం చైర్ లో లేకపోతే.. టీఎంసీలో లుకలుకలు సృష్టించడానికి కూడా బీజేపీ వెనకాడకపోవచ్చు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే భవానీపూర్ లో విజయకేతనం ఎగరేయాలని చూస్తున్నారు మమతా బెనర్జీ. అయితే ఈసీ లేఖతో.. ఆదినుంచీ ఆమెకు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారు బీజేపీ నేతలు.

First Published:  15 Sep 2021 9:59 PM GMT
Next Story