Telugu Global
Health & Life Style

బ్రేక్ త్రూ భయం!

వ్యాక్సినేషన్ సక్సెస్ ఫుల్ గా జరుగుతుండడంతో జనాలకు కరోనా భయం తగ్గింది. అయితే ఇప్పుడు చాలామందికి కొత్తగా కరోనా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల భయం పట్టుకుంది. బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ అంటే.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడటం. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఈ బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ల రేటు ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా బారిన పడ్డ వారి సంఖ్య మనదేశంలో కూడా […]

బ్రేక్ త్రూ భయం!
X

వ్యాక్సినేషన్ సక్సెస్ ఫుల్ గా జరుగుతుండడంతో జనాలకు కరోనా భయం తగ్గింది. అయితే ఇప్పుడు చాలామందికి కొత్తగా కరోనా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల భయం పట్టుకుంది. బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ అంటే.. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడటం. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఈ బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ల రేటు ఎక్కువగా ఉంటుంది.

వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా బారిన పడ్డ వారి సంఖ్య మనదేశంలో కూడా పెరుగుతోంది. అయితే ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే వ్యాక్సినేషన్ తర్వాత కోవిడ్ సోకితే లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లతో ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు ప్రమాదకరం కానప్పటికీ ఇవి కరోనా వ్యాప్తికి మాత్రం కారణంగా మారొచ్చు. వ్యాక్సినేషన్ తర్వాత కోవిడ్ సోకిన వారు వైరస్ ను మరొకరికి వ్యా్పింపజేసే అవకాశం ఉంది. అందుకే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కోవిడ్ సోకితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

ఇకపోతే వయసు పైబడిన వారిపై బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్ తీవ్ర ప్రభావం చూపుతుందని మరో అధ్యయనం వెల్లడించింది. ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యాక కూడా కోవిడ్ తీవ్రమైన ప్రభావం చూపుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనం సూచిస్తోంది. సీడీసీ నివేదికల ప్రకారం బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు సోకి ఆసుపత్రి పాలైనవారు, చనిపోయిన వారు కూడా ఉన్నారు. అందుకే దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వయసు పైబడిన వారు వ్యాక్సినేషన్ తర్వాత కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం.

First Published:  15 Sep 2021 12:07 AM GMT
Next Story