Telugu Global
International

మళ్లీ లాక్ డౌన్ దిశగా చైనా..

కరోనా మహమ్మారినుంచి త్వరగానే కోలుకున్నట్టు కనిపించిన చైనా.. పదే పదే కొత్త కేసులతో సతమతం అవుతోంది. ఇప్పటికే అక్కడ రెండు దఫాలు లాక్ డౌన్ విధించి, మినహాయింపులిచ్చారు. తాజాగా ఇప్పుడు మూడోసారి లాక్ డౌన్ గుప్పెట్లోకి వెళ్లబోతోంది చైనా. అక్కడ డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఫుజియాన్ ప్రావిన్స్ లో కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొంది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ప్రజలెవరూ ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫుజియాన్ ప్రావిన్స్ లో […]

మళ్లీ లాక్ డౌన్ దిశగా చైనా..
X

కరోనా మహమ్మారినుంచి త్వరగానే కోలుకున్నట్టు కనిపించిన చైనా.. పదే పదే కొత్త కేసులతో సతమతం అవుతోంది. ఇప్పటికే అక్కడ రెండు దఫాలు లాక్ డౌన్ విధించి, మినహాయింపులిచ్చారు. తాజాగా ఇప్పుడు మూడోసారి లాక్ డౌన్ గుప్పెట్లోకి వెళ్లబోతోంది చైనా. అక్కడ డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఫుజియాన్ ప్రావిన్స్ లో కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొంది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ప్రజలెవరూ ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఫుజియాన్ ప్రావిన్స్ లో రోజు రోజుకీ కేసులు రెట్టింపు అవుతున్నాయి. కేసుల సంఖ్య 102గానే ఉన్నా.. ఇటీవల కాలంలో ఒక్క కేసుకూడా లేకుండా చూసుకున్న చైనా ప్రభుత్వాన్ని.. వందల సంఖ్యలో వెలుగు చూస్తున్న కొత్త కేసులు కలవరపెడుతున్నాయి. దీంతో ఫుజియాన్ ప్రావిన్స్ నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిషేధించారు.

చైనాలోని పోర్టు సిటీ జియామిన్‌ నగరంలో రెండు రోజుల వ్యవధిలో 33 కేసులు వెలుగు చూశాయి. పుటియాన్‌ అనే మరో నగరంలో 59 కేసులు వచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, బార్లు మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫుజియాన్‌ ప్రావిన్స్‌ నుంచి విమాన సర్వీసుల్ని రద్దు చేశారు. 60శాతం విమానాల రాకపోకలు ఆగిపోయాయి. కరోనా బాధితులను కలసినవారిని గుర్తించి, వారిని కట్టడి చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని భావిస్తున్నారు అధికారులు.

ఆస్ట్రేలియాలోనూ అదే పరిస్థితి..
ఆస్ట్రేలియా రాజధాని కాన్‌ బెర్రాలో కరోనా కేసులు పెరగడంతో లాక్‌ డౌన్‌ ను మరోసారి పొడిగించారు. అక్టోబర్ 15వరకు అక్కడ లాక్ డౌన్ కొనసాగుతుంది. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిపోయిన తర్వాత.. కేరళ మినహా భారత్ లోని ఇతర రాష్ట్రాల్లో కేసులు పెరగలేదు. కేరళలో కూడా ఇప్పుడిప్పుడే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తోంది. ఇక విదేశాల్లో మాత్రం అక్కడక్కడా కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు దారితీస్తోంది. ముఖ్యంగా చైనాలో ఒకటీ అరా కేసులు పెరిగినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతోంది. తాజాగా ఫుజియాన్ ప్రావిన్స్ లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ప్రకటించిన చైనా.. ఇతర ప్రాంతాలలో ఆంక్షలు పెంచింది.

First Published:  14 Sep 2021 9:53 PM GMT
Next Story