గణేశుడి చేతిలో శానిటరీ న్యాప్కిన్స్.. రచ్చ రచ్చ
స్త్రీల నెలసరి విషయంలో ఇప్పటికీ అనేక అపోహలు ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక ఏళ్లుగా అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. చాలారోజుల పాటు ప్రభుత్వాలు ఈ విషయంపై చర్చించేందుకు పెద్దగా ఇష్టపడేవి కావు. కానీ ఇటీవల మహిళలు రుతుస్రావ సమస్యలపై అంతా బహిరంగంగా మాట్లాడుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేస్తున్నాయి. కొన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సైతం నెలసరి సమయంలో స్త్రీలను […]
స్త్రీల నెలసరి విషయంలో ఇప్పటికీ అనేక అపోహలు ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక ఏళ్లుగా అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. చాలారోజుల పాటు ప్రభుత్వాలు ఈ విషయంపై చర్చించేందుకు పెద్దగా ఇష్టపడేవి కావు. కానీ ఇటీవల మహిళలు రుతుస్రావ సమస్యలపై అంతా బహిరంగంగా మాట్లాడుతున్నారు.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేస్తున్నాయి. కొన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సైతం నెలసరి సమయంలో స్త్రీలను ఏ పని చేయనివ్వరు. ముఖ్యంగా దేవుడి గదికి వెళ్లనివ్వకపోవడం, పవిత్రమైన పనులు చేయనీయకపోవడం వంటివి చేస్తుంటారు. స్త్రీలు నెలసరి సమయంలో శుభకార్యాలకు సైతం వెళ్లరు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ బాగ్ది అనే వ్యక్తి.. చాలా ఏళ్లుగా ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయన అనివార్య అనే ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి ఇప్పటివరకు దాదాపు 20 లక్షల శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేశారు.
అంకిత్ ఇటీవల తన కార్యాలయంలో గణేశ్ పండగ సందర్భంగా వినాయకుడి విగ్రహం నెలకొల్పారు. ఈ వినాయకుడి రెండు చేతుల్లో ఆయుధాలకు బదులుగా శానిటరీ న్యాపికిన్స్ ఉంచారు. స్త్రీల సమస్యల పట్ల అవగాహన కోసం తాను ఇలా చేశానంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ విషయం వివాదాస్పదం అయింది. అంకిత్ బాగ్ది తీరుపట్ల హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. శానిటరీ న్యాపికిన్స్ విషయంలో అవగాహన కల్పించడంలో తప్పులేదని.. కానీ అందుకు దేవతా ప్రతిమలను వాడుకోవడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అంకిత్ చేసిన పనిని మరి కొందరు అభినందిస్తున్నారు.