Telugu Global
Health & Life Style

కొలెస్ట్రాల్ మంచిదేనా?

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది గుండె వ్యాధులతో బాధపడుతున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడం ఈ గుండె వ్యాధులకు అన్నింటికంటే ఎక్కువగా కారణమవుతుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ విషయంలో ఇప్పటికీ ఎన్నో సందేహాలున్నాయి. కొలెస్ట్రాల్ విషయంలో బ్లడ్ కొలెస్ట్రాల్ డేంజర్ అని డైటరీ కొలెస్ట్రాల్ మంచిదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే ఇదే విషయంపై తాజా అధ్యయనాలు ఏం చెప్తున్నాయో ఓ సారి చూద్దాం. బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ పెరగడానికి డైటరీ కొవ్వులు ఏ మాత్రం కారణం కాదనేది […]

కొలెస్ట్రాల్ మంచిదేనా?
X

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది గుండె వ్యాధులతో బాధపడుతున్నారు. రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడం ఈ గుండె వ్యాధులకు అన్నింటికంటే ఎక్కువగా కారణమవుతుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ విషయంలో ఇప్పటికీ ఎన్నో సందేహాలున్నాయి. కొలెస్ట్రాల్ విషయంలో బ్లడ్ కొలెస్ట్రాల్ డేంజర్ అని డైటరీ కొలెస్ట్రాల్ మంచిదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే ఇదే విషయంపై తాజా అధ్యయనాలు ఏం చెప్తున్నాయో ఓ సారి చూద్దాం.

బ్లడ్‌ కొలెస్ట్రాల్‌ పెరగడానికి డైటరీ కొవ్వులు ఏ మాత్రం కారణం కాదనేది కొందరి వాదన. కానీ కొంతమందిలో డైటరీ కొలెస్ట్రాల్ కూడా కార్డియోవాస్కులర్ వ్యాధులకు కారణంగా మారగలదని ఓ రీసెంట్ స్టడీ చెప్పడంతో మళ్లీ ఈ టాపిక్ తెరపైకి వచ్చింది.

తేడా ఇదే
బ్లడ్ కొలెస్ట్రాల్ ఒక మైనపు కొవ్వు లాంటి పదార్థం. దీనిని అవసరమైనప్పుడు కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అలాగే డైటరీ కొలెస్ట్రాల్ అనేది మాంసం, కాలేయం, గుడ్డు సొనలు, షెల్ ఫిష్ వంటి జంతువుల ఆహారాలలో కనిపిస్తుంది. కొన్ని శారీరక విధులను నిర్వహించడానికి, విటమిన్ డి తయారు చేయడానికి ఈ కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది.

అయితే డైటరీ కొలెస్ట్రాల్ తో వచ్చే ప్రమాదం ఏమీ ఉండదని ఇప్పటివరకూ ఓ అభిప్రాయం ఉండేది. అయితే దానిని సవాల్ చేస్తూ.. మరియా ఎల్ ఫెర్నాండెజ్ అనే సైంటిస్ట్ ‘రెథింకింగ్ డైటరీ కొలెస్ట్రాల్’ పేరుతో ఓ కథనాన్ని రాశారు. ఇందులో డైటరీ కొలెస్ట్రాల్ కూడా బ్లడ్ కొలెస్ట్రాల్ ను పెంచడానికి కారణమవుతుందని, కానీ అది జన్యుపరమైన విషయాలపై ఆధారపడుతుందని ఆమె పేర్కొన్నారు. 18 నుండి 57 సంవత్సరాల వయస్సు గల 40 మంది పురుషులకు, ఎగ్ బేస్డ్ డైట్ ఇచ్చి ఆమె ఓ ప్రయోగం జరిపారు. అందులో కొందరికి బ్లడ్ కొలెస్ట్రాల్ పెరగడాన్ని ఆమె గమనించారు. దాంతో ఆమె ఈ నిర్ధారణకు వచ్చారు.

కానీ ఇప్పటివరకూ డైటరీ కొలెస్ట్రాల్ గుండె సమస్యలను పెంచుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆరోగ్యంగా ఉన్న సాధారణ వ్యక్తులకు డైటరీ కొలెస్ట్రాల్, ఇంకా గుడ్డు తో ఎలాంటి ప్రమాదమూ లేదని సైంటిస్టులు వాదిస్తున్నారు.

గుడ్డులో అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. గుడ్డులో 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ఇది అధిక కొలెస్ట్రాల్ ఫుడ్ లిస్ట్ లో ఉండదు. కారణం అది ఎలాంటి హానీ చేయకపోవడమే. వీటన్నింటిని బట్టి చూస్తే.. డైటరీ కొలెస్ట్రాల్ మీద అనుమానాలున్నప్పటికీ.. అది ఎలాంటి హానీ చేయదని సైంటిస్టులు నిర్థారిస్తున్నారు. కానీ అల్రెడీ టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ కొలెస్ట్రాల్ ఇబ్బందిగా మారొచ్చు.

మొత్తానికి డైటరీ కొలెస్ట్రాల్ అయినా, బ్లడ్ కొలెస్ట్రాల్ అయినా.. సహజంగా తగ్గించే ప్రయత్నం చేస్తే వాటితో వచ్చే నష్టా్న్ని తగ్గించుకోవచ్చు. ముందుగా కొలెస్ట్రాల్ కు ప్రమాద కారకాలు శారీరక శ్రమ లేకపోవడం. అందుకే తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ద్వారా ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ధూమపానం, ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ను కూడా తగ్గించడం మంచిది.

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే అదనంగా ఉన్న బరువును తగ్గించుకోవాలి. ప్రస్తుతం ఉన్న శరీర బరువులో కేవలం 5 నుండి 10 శాతం తగ్గించుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించుకోవచ్చు.
కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి పోషకాహారం చాలా ముఖ్యమైనది. గింజలు, విత్తనాలు, చిక్కుళ్ళు, ఆకుపచ్చ ఆకు కూరగాయలు, బీన్స్, పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల రక్త కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది.

ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పిజ్జా, కుకీలు, బిస్కెట్లు, నూడుల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

First Published:  14 Sep 2021 3:13 AM GMT
Next Story