Telugu Global
NEWS

గెజిట్ అమలు వాయిదా వేస్తారా..? నీటి వాటాలపై మరో కీలక భేటీ..

ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటాల విషయంలో ఎడతెగని చర్చలు కొనసాగుతున్నాయి. బోర్డుల పరిధిని దాటి వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో నేరుగా కేంద్రం కలుగజేసుకుని గెజిట్ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి ఖరారు చేస్తూ జులై16న గెజిట్ విడుదల చేసిన కేంద్రం, అక్టోబర్ 14నుంచి అది అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. అనుమతులు లేని ప్రాజెక్ట్ ల జాబితాలో ఉన్న వాటిపై ఆరు నెలల్లోగా తేల్చేస్తామని డెడ్ లైన్ పెట్టింది. అయితే రెండు రాష్ట్రాలు […]

గెజిట్ అమలు వాయిదా వేస్తారా..? నీటి వాటాలపై మరో కీలక భేటీ..
X

ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటాల విషయంలో ఎడతెగని చర్చలు కొనసాగుతున్నాయి. బోర్డుల పరిధిని దాటి వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో నేరుగా కేంద్రం కలుగజేసుకుని గెజిట్ విడుదల చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి ఖరారు చేస్తూ జులై16న గెజిట్ విడుదల చేసిన కేంద్రం, అక్టోబర్ 14నుంచి అది అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. అనుమతులు లేని ప్రాజెక్ట్ ల జాబితాలో ఉన్న వాటిపై ఆరు నెలల్లోగా తేల్చేస్తామని డెడ్ లైన్ పెట్టింది. అయితే రెండు రాష్ట్రాలు ఈ గెజిట్ పై పెదవి విరిచాయి. అనుమతులు లేని ప్రాజెక్ట్ లంటూ కేంద్రం ప్రకటించిన జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశాయి.

కేంద్రం విడుదల చేసిన గెజిట్ ప్రకారం కృష్ణా బేసిన్‌ లోని 36 ప్రాజెక్టులు, గోదావరి పై నిర్మించిన 71 ప్రాజెక్టులు.. ఆయా నదీ యాజమాన్య బోర్డుల నియంత్రణలోకి వస్తాయి. ఈ బోర్డుల నిర్వహణకు రెండు రాష్ట్రాలు చెరో 200 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఉమ్మడి ప్రాజెక్టులు, కాలువల వద్ద కేంద్ర బలగాలను నియమిస్తారు. వీటి నిర్వహణ బాధ్యతను బోర్డులే చూస్తాయి. మొత్తం మేజర్, మీడియం ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వస్తాయి. ఒకరకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా బోర్డులే ఆదేశించే పరిస్థితి. విద్యుత్ ఉత్పత్తి అయినా, సాగు నీటి విడుదల అయినా ఆయా బోర్డుల ఇష్ట ప్రకారమే జరుగుతుంది, రాష్ట్రాలు కేవలం తమ అవసరాలను మాత్రమే చెప్పాల్సి ఉంటుంది.

అయితే రెండు రాష్ట్రాలకు ఈ గెజిట్ తో ఇబ్బంది ఎదురవుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై అభ్యంతరాలు తెలియజేశాయి. నోటిఫికేషన్ అమలు తేదీని వాయిదా వేయాలని తెలంగాణ కోరింది. అనుమతులు లేని ప్రాజెక్ట్ లంటూ కేంద్రం విడుదల చేసిన జాబితాను సవరించాలని పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి కేటాయింపుల ప్రకారం సదరు ప్రాజెక్ట్ లన్నిటికీ అనుమతులున్నాయని, కొత్తగా వాటికి అనుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇటు ఏపీ కూడా అనుమతులు లేవంటూ కేంద్రం విడుదల చేసిన జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

రెండు రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థననలు, ఆందోళనల మేరకు కేంద్రం చర్చలు మొదలు పెట్టింది. ఢిల్లీలో ఈనెల 13న కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ లతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశం కాబోతున్నారు. గెజిట్ పై రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరిస్తారా, లేక అమలు తేదీని వాయిదా వేస్తారా అనేది ఈ సమావేశంలో తేలిపోతుంది.

First Published:  11 Sep 2021 9:08 PM GMT
Next Story