Telugu Global
National

తాయిలాలు అయిపోయాయి.. వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఇక చుక్కలే..

భారత్ లో వ్యాక్సినేషన్ మొదలైన సమయంలో చాలామంది వెనకడుగేశారు. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవని, అది వందశాతం సురక్షితం అని తేలిన తర్వాతే అందరూ టీకాలకోసం ముందుకొస్తున్నారు. అయినా కూడా కొంతమంది ఇప్పటికీ వ్యాక్సిన్ విషయంలో భయపడటం చూస్తూనే ఉన్నాం, మరికొందరు నిర్లక్ష్యంతో టీకాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం విశేషం. ముఖ్యంగా పంజాబ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల్లో కనీసం 50శాతం మంది కూడా […]

తాయిలాలు అయిపోయాయి.. వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఇక చుక్కలే..
X

భారత్ లో వ్యాక్సినేషన్ మొదలైన సమయంలో చాలామంది వెనకడుగేశారు. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవని, అది వందశాతం సురక్షితం అని తేలిన తర్వాతే అందరూ టీకాలకోసం ముందుకొస్తున్నారు. అయినా కూడా కొంతమంది ఇప్పటికీ వ్యాక్సిన్ విషయంలో భయపడటం చూస్తూనే ఉన్నాం, మరికొందరు నిర్లక్ష్యంతో టీకాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం విశేషం. ముఖ్యంగా పంజాబ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల్లో కనీసం 50శాతం మంది కూడా వ్యాక్సినేషన్ కి ముందుకు రాలేదని ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దీంతో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులందర్నీ సెలవుపై పంపించేస్తామని హెచ్చరించారు.

వ్యాక్సినేషన్లో ప్రభుత్వ ఉద్యోగులకే తొలి ప్రాధాన్యతనిచ్చాయి రాష్ట్ర ప్రభుత్వాలు. నేరుగా ప్రజలతో సంబంధం ఉండే డిపార్ట్ మెంట్లన్నిటిలో వందశాతం వ్యాక్సినేషన్ జరగేలా చూశారు. అయితే పంజాబ్ లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకో వ్యాక్సినేషన్ కి దూరంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వం ఈ నిబంధన తెరపైకి తెచ్చింది. అనారోగ్య కారణం మినహా మరే ఇతర కారణంతోనైనా ఇప్పటివరకూ సింగిల్ డోసు కూడా తీసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవలు ప్రకటించింది. అలాంటి ఉద్యోగులందరినీ ఈ నెల 15 తర్వాత సెలవుపై పంపిస్తామని సీఎం అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు. కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

నిన్న మొన్నటి వరకూ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఫలానా చోట బిర్యానీ ఫ్రీ అని, బీరు ఫ్రీ అని, మరో చోట బట్టల షాపులో డిస్కౌంట్ ఇస్తారనే ప్రచారాలు జోరుగా సాగాయి. తాయిలాలతో పని కావడంలేదని తేలిన తర్వాత ఇప్పుడు ఏకంగా ప్రభుత్వాలు బెదిరింపులకు దిగుతున్నాయి. ముందుగా పంజాబ్ సర్కారు ఉద్యోగులను సెలవలపై పంపించేస్తామని వార్నింగ్ ఇచ్చింది. భారత్ లో వ్యాక్సినేషన్ ఉచితమే కానీ, నిర్బంధం కాదు. ఈ సందర్భంలో పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఉద్యోగులు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేయించుకునేలా అవగాహన కల్పించాలి కానీ, ఇలా సెలవలిచ్చేస్తామంటూ బెదిరించడం సరికాదని అంటున్నాయి.

First Published:  10 Sep 2021 9:58 PM GMT
Next Story