Telugu Global
Cinema & Entertainment

అనుపమ ఫస్ట్ లుక్ రిలీజ్

వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం […]

అనుపమ ఫస్ట్ లుక్ రిలీజ్
X

వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది.

కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ పోషిస్తున్న నందిని పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శక నిర్మాతలు.

ఒక అందమైన అడవి.. పచ్చని చెట్లు.. ప్రశాంతమైన వాతావరణం.. అందులో నుంచి ఒక సీతాకోకచిలుక
ఎగురుకుంటూ వచ్చి.. అనుపమ పరమేశ్వరన్ చేతిపై వాలుతుంది. అలా నందిని పాత్రను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. కొత్తగా ఉన్న ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు
గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. డిసెంబర్ లో సినిమాను థియేటర్స్ లో సినిమా చేసేందుకు సన్నాహాలు
చేస్తున్నారు.

First Published:  11 Sep 2021 9:52 AM GMT
Next Story