రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో ఆసక్తికర వాదనలు..
ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. తాజాగా మరోసారి ఇరు రాష్ట్రాల వాదనలు విన్నది. కేంద్రం కూడా దీనిపై వివరణ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చెందిన పనులను జులై 7 నుంచి ఆపివేశామని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి నివేదిక అందించింది. అయితే తెలంగాణ దీనిపై అభ్యంతరం తెలిపింది. ఎత్తిపోతల పనులు ఆపలేదని, కొనసాగుతున్నాయంటూ తెలంగాణ […]
ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. తాజాగా మరోసారి ఇరు రాష్ట్రాల వాదనలు విన్నది. కేంద్రం కూడా దీనిపై వివరణ ఇచ్చింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చెందిన పనులను జులై 7 నుంచి ఆపివేశామని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీకి నివేదిక అందించింది. అయితే తెలంగాణ దీనిపై అభ్యంతరం తెలిపింది. ఎత్తిపోతల పనులు ఆపలేదని, కొనసాగుతున్నాయంటూ తెలంగాణ తరపు న్యాయవాదులు కొన్ని సాక్ష్యాలను కూడా ఎన్జీటీకి అందించారు. ఎన్జీటీ సభ్యులు వచ్చి ఎత్తిపోతల పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించాలని కోరారు.
డ్రోన్ కెమెరాతో వీడియో తీసి పంపిస్తాం..
పనులు ఆగిపోయాయని ఏపీ అబద్ధాలు చెబుతోందన్న తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్, తమకు అనుమతిస్తే డ్రోన్ కెమెరా ద్వారా వీడియోలు తీసి ఎన్జీటీకి అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న ఎన్జీటీ.. రేపు తెలంగాణ ప్రాజెక్ట్ లపై కూడా డ్రోన్లు ఎగరేయడాని ఏపీ అనుమతి అడిగితే ఏం చెప్పాలని ప్రశ్నించింది.
ఏపీ వాదన సమర్థించిన కేంద్రం..
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనుమతులు కోరుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన దరఖాస్తు పెండింగ్ లో ఉందని కేంద్రం ఎన్జీటీకి తెలిపింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పనులూ జరగడంలేదని స్పష్టం చేసింది. అయితే నిబంధనలు ఉల్లంఘిచారా లేదా అనే ప్రశ్నకు స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది ఎన్జీటీ. పనులు చేయడంలేదన్న ఏపీ తరఫు న్యాయవాది హామీని రికార్డు చేసిన ఎన్జీటీ తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.