Telugu Global
National

భవానీపూర్​లో దీదీపై పోటీచేసేది ఎవరు? బీజేపీ క్లారిటీ..!

పశ్చిమబెంగాల్​ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, టీఎంసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఇక్కడ గెలవాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ బెంగాల్​ ప్రజలు మాత్రం మళ్లీ మమతా బెనర్జీకే అవకాశం ఇచ్చారు. పార్టీ గెలుపొందినప్పటికీ నందిగ్రామ్​ నుంచి పోటీచేసిన మమతా బెనర్జీ.. తన మాజీ అనుచరుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో గెలుపుపై అప్పట్లో సవాళ్లు.. ప్రతి సవాళ్లు జరిగాయి. […]

భవానీపూర్​లో దీదీపై పోటీచేసేది ఎవరు? బీజేపీ క్లారిటీ..!
X

పశ్చిమబెంగాల్​ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, టీఎంసీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఇక్కడ గెలవాలని బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ బెంగాల్​ ప్రజలు మాత్రం మళ్లీ మమతా బెనర్జీకే అవకాశం ఇచ్చారు. పార్టీ గెలుపొందినప్పటికీ నందిగ్రామ్​ నుంచి పోటీచేసిన మమతా బెనర్జీ.. తన మాజీ అనుచరుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు.

ఈ నియోజకవర్గంలో గెలుపుపై అప్పట్లో సవాళ్లు.. ప్రతి సవాళ్లు జరిగాయి. ఇదిలా ఉంటే దీదీ మాత్రం సీఎంగా ప్రమాణం చేశారు. ఆమె ఆరునెలల్లో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాలి. దీంతో ప్రస్తుతం అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి. మమతా బెనర్జీ భవానీపూర్​ నియోజకవర్గం నుంచి పోటీచేయబోతున్నారు. అక్కడి ఎమ్మెల్యే మమత కోసం రాజీనామా చేశారు.

అయితే భవానీపూర్​ నుంచి మరోసారి సువేందు అధికారి పోటీచేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అధిష్టానం ఆదేశిస్తే తాను భవానీపూర్​ నుంచి పోటీచేస్తానంటూ సువేందు అధికారి ప్రకటించారు. దీంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ స్పందించారు. ‘ భవానీపూర్​లో సువేందు అధికారి పోటీచేయడం లేదు. సువేందు ఇప్పటికే దీదీని ఓడించారు. కాబట్టి భవానీపూర్​లో మరో అభ్యర్థి ఆమెను ఓడిస్తారు ’ అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేశారు.

First Published:  7 Sep 2021 1:12 PM GMT
Next Story