Telugu Global
National

భారత్ లో టీకాల మార్పిడి కుదరదు.. బూస్టర్ డోస్ అవసరం లేదు..

ఫస్ట్ డోస్ ఒక కంపెనీ టీకా వేసుకుని, రెండో డోసుకి మరో కంపెనీ టీకా వేయించుకుంటామంటే కుదరదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తొలి డోసు ఏ టీకా తీసుకుంటారో, రెండో డోసు కూడా అదే టీకా వేయించుకోవాలని టీకాల మార్పిడికి అనుమతి లేదని తేల్చి చెప్పింది. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు తాజాగా మరికొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. భారత్ లో బూస్టర్ డోస్ అవసరంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతానికి […]

భారత్ లో టీకాల మార్పిడి కుదరదు.. బూస్టర్ డోస్ అవసరం లేదు..
X

ఫస్ట్ డోస్ ఒక కంపెనీ టీకా వేసుకుని, రెండో డోసుకి మరో కంపెనీ టీకా వేయించుకుంటామంటే కుదరదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తొలి డోసు ఏ టీకా తీసుకుంటారో, రెండో డోసు కూడా అదే టీకా వేయించుకోవాలని టీకాల మార్పిడికి అనుమతి లేదని తేల్చి చెప్పింది. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు తాజాగా మరికొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం. భారత్ లో బూస్టర్ డోస్ అవసరంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతానికి బూస్టర్ డోస్ అవసరం లేదని చెప్పింది.

తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలు..
– కరోనా నుంచి కోలుకున్న వారికి 3 నెలల తర్వాతే టీకా వేయాలి. మొదటి డోస్‌ తీసుకున్న తర్వాత కరోనా సోకితే రికవరీ అయిన మూడు నెలల తర్వాతే రోండో డోస్ వేయాలి.
– ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న టీకాల్లో ప్రజలు తమకు నచ్చినదాన్ని ఎంచుకునే వీలుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో లభ్యమయ్యే కంపెనీల టీకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కొవిన్‌ పోర్టల్‌ లో ప్రభుత్వ, ప్రైవేటు కరోనా టీకా కేంద్రాల్లో వివిధ వ్యాక్సిన్‌ ల లభ్యత, వాటి వివరాలు ఉంటాయి.
– దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి టీకాలతో నష్టం లేదు. అందరూ టీకాలు వేయించుకోవచ్చు. గర్భిణులు కూడా టీకా తీసుకోవాలి. సంతానోత్పత్తిపై టీకా ప్రభావం చూపుతుందన్న వార్తలు అవాస్తవం.
– టీకా తీసుకునే ముందు కరోనా టెస్ట్ అవసరం లేదు.

టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరి..
టీకా తీసుకున్నంత మాత్రాన కరోనాను జయించినట్టు కాదని, మాస్క్ ధరించడం సామాజిక దూరం తప్పనిసరి అని తెలిపింది కేంద్రం. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించింది. టీకాలు పొందిన వ్యక్తుల్లో యాంటీబాడీస్‌ ఎంతకాలం ఉంటాయనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని, అందు వల్ల కరోనా జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. కొత్త వేరియంట్లతో భయం వద్దని, ప్రస్తుతం భారత్ లో వినియోగంలో ఉన్న అన్ని టీకాలు, అన్ని వేరియంట్లనుంచి తగిన స్థాయిలో రక్షణను అందిస్తాయని చెప్పింది.

First Published:  7 Sep 2021 9:26 PM GMT
Next Story