Telugu Global
International

ఆఫ్ఘన్ లో కొత్త ప్రభుత్వం.. అధినేత ముల్లా మొహ్మద్

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుపై అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే ఇది పూర్తి స్థాయి ప్రభుత్వం కాదని, తాత్కాలిక ప్రభుత్వమేనంటున్నారు తాలిబన్లు. తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా ముల్లా మొహ్మద్ హసన్ అఖుంద్ ని ఎన్నుకున్నారు. ఈ ప్రకటనతో తాలిబన్ల గ్రూపులో విభేదాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. వాస్తవానికి గత శుక్రవారమే కొత్త ప్రభుత్వంపై ప్రకటన వెలువడాల్సి ఉంది. హైబతుల్లా అఖుంద్‌ జాదా సుప్రీం లీడర్‌ గా.. ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే […]

ఆఫ్ఘన్ లో కొత్త ప్రభుత్వం.. అధినేత ముల్లా మొహ్మద్
X

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటుపై అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే ఇది పూర్తి స్థాయి ప్రభుత్వం కాదని, తాత్కాలిక ప్రభుత్వమేనంటున్నారు తాలిబన్లు. తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా ముల్లా మొహ్మద్ హసన్ అఖుంద్ ని ఎన్నుకున్నారు. ఈ ప్రకటనతో తాలిబన్ల గ్రూపులో విభేదాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. వాస్తవానికి గత శుక్రవారమే కొత్త ప్రభుత్వంపై ప్రకటన వెలువడాల్సి ఉంది. హైబతుల్లా అఖుంద్‌ జాదా సుప్రీం లీడర్‌ గా.. ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే అంతర్గత విభేదాలతో ప్రభుత్వ ఏర్పాటు వాయిదా పడింది. తీరా ఇప్పుడు ముల్లా మొహ్మద్ పేరు తెరపైకి వచ్చింది.

ఎవరీ ముల్లా..?
ముల్లా హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక స్థానంలో ఉన్నారు. ఆయన స్వస్థలం కాందహార్. తాలిబన్ ఇక్కడినుంచే మొదలైంది. ప్రస్తుతం కాందహార్‌ లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు ముల్లా. దాదాపు 20 సంవత్సరాలుగా ‘రెహబరీ షురా’ కమిటీ అధినేతగా ఉన్నారు. 1996 లో ఏర్పడ్డ తాలిబన్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా, విదేశాంగ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఆయనకు ఉంది. రెండోసారి ఏర్పడుతున్న ప్రభుత్వానికి ఆయనే అధినేత అయ్యారు.

దేశ ఉప ప్రధానిగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ వ్యవహరిస్తారు. వీరితో పాటు అఫ్ఘన్‌ ను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు కొనసాగించిన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేతలను కూడా పదవులు వరించాయి. తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ తనయుడు ముల్లా యాకుబ్‌ ను రక్షణ మంత్రిగా, సిరాజుద్దీన్‌ హక్కానీని అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించారు. అయితే, కేబినెట్‌ ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదని, ఇది తాత్కాలికమైనదేనని తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ స్పష్టంచేశారు. మహిళా సాధికారత అంటూ ప్రసంగాలిచ్చినా, మహిళల హక్కుల్ని గౌరవిస్తామని చెప్పుకున్నా.. కేబినెట్ లో మహిళలకు స్థానం లేకుండా చేశారు తాలిబన్లు.

First Published:  7 Sep 2021 9:48 PM GMT
Next Story