Telugu Global
NEWS

గణేశ్​ మండపాలు పెట్టుకోవచ్చు.. కానీ ఓ కండీషన్​.. హైకోర్టు క్లారిటీ

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్​లో గణేశ్​ మండపాల విషయంలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో గణేశ్​ మండపాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో బీజేపీ, టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. హిందూ పండుగలకే ఆంక్షలా? అంటూ ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ.. ఈ పిటిషన్​పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఆంక్షలను సమర్థిస్తూనే కొన్ని ఆదేశాలు జారీచేసింది. ‘మత పరమైన కార్యక్రమాలను అడ్డుకొనే […]

గణేశ్​ మండపాలు పెట్టుకోవచ్చు.. కానీ ఓ కండీషన్​.. హైకోర్టు క్లారిటీ
X

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్​లో గణేశ్​ మండపాల విషయంలో వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో గణేశ్​ మండపాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో బీజేపీ, టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. హిందూ పండుగలకే ఆంక్షలా? అంటూ ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ.. ఈ పిటిషన్​పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వ ఆంక్షలను సమర్థిస్తూనే కొన్ని ఆదేశాలు జారీచేసింది. ‘మత పరమైన కార్యక్రమాలను అడ్డుకొనే హక్కు ఎవరికీ లేదు. కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రైవేటు స్థలాల్లో వేడుకలు జరుపుకోవచ్చు. ఒక్కో గణేశ్​ మండపంలో ఐదుగురికి మించి ఎక్కువగా భక్తులు ఉండకుండా చూసుకోవాలి.’ అంటూ హైకోర్టు పేర్కొన్నది.

ప్రైవేటు స్థలాల్లో గణేశ్​ మండపాల ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొంతకాలంగా గణేశ్​ మండపాలకు అనుమతి ఇచ్చే విషయంలో అధికార, విపక్షాలకు మధ్య మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇతర మతస్తుల పండుగులు, వేడుకల విషయంలో అనుమతులు జారీ చేసిందని.. కానీ హిందూ పండుగల విషయంలో వివక్ష చూపుతోందని బీజేపీ ఆరోపించింది.

మొత్తానికి ఈ అంశం రాజకీయ, మత రంగును పులుముకొన్నది. అయితే భారతీయ జనతా పార్టీ మతం పేరిట రాజకీయాలు చేస్తుందని.. ప్రజలను రెచ్చగొడుతున్నది అధికార పార్టీ నేతలు ఆరోపించారు.
కరోనా విషయంలో కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల ఆధారంగానే తాము వ్యవహరిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకున్నది.

First Published:  8 Sep 2021 11:55 AM GMT
Next Story