Telugu Global
NEWS

ఏడాదిలోగా ఏపీలో అన్ని రోడ్లు బాగుపడాలి..

వర్షాకాలం ముగిసిన వెంటనే ఏపీలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వచ్చే వర్షాకాలం నాటికి మరమ్మతు పనులన్నీ పూర్తి కావాలని టెండర్లు పిలవని చోట్ల వెంటనే ఆ ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. రోడ్లు, పోర్ట్ లపై మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇటీవల రోడ్ల పరిస్థితిపై జరుగుతున్న ప్రచారంపై కూడా సీఎం స్పందించారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా వదిలేసిందని, వర్షాలు పడటంతో ఇప్పుడు రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రతి […]

ఏడాదిలోగా ఏపీలో అన్ని రోడ్లు బాగుపడాలి..
X

వర్షాకాలం ముగిసిన వెంటనే ఏపీలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వచ్చే వర్షాకాలం నాటికి మరమ్మతు పనులన్నీ పూర్తి కావాలని టెండర్లు పిలవని చోట్ల వెంటనే ఆ ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. రోడ్లు, పోర్ట్ లపై మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇటీవల రోడ్ల పరిస్థితిపై జరుగుతున్న ప్రచారంపై కూడా సీఎం స్పందించారు. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా వదిలేసిందని, వర్షాలు పడటంతో ఇప్పుడు రోడ్లు దెబ్బతిన్నాయని, ప్రతి విషయంలోనూ వక్రీకరణలు జరుగుతున్నాయని అన్నారు జగన్. నెగెటివ్‌ ఉద్దేశంతో ప్రచారం చేసినా.. పాజిటివ్‌ గా తీసుకుని అడుగులు వేద్దామని చెప్పారు. పనులను బాగా చేస్తే నెగెటివ్‌ మీడియా ఎన్ని రాసినా ప్రజలు గమనిస్తారని స్పష్టం చేశారు.

ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, అడుగుకో గుంత-గజానికో గొయ్యి అంటూ ఇటీవల జనసేన డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఎక్కడికక్కడ జిల్లాల్లో రోడ్ల ప్రస్తుత పరిస్థితిని వీడియోలు, ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ నేతలు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వం చేసిన పాపం వల్లే రోడ్లు ఇలా ఉన్నాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగ్గొట్టారని, కనీసం రిపేర్లు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదని అంటున్నారు వైసీపీ నేతలు. చిన్న సమస్యని భూతద్దంలో పెట్టి చూపించడం సరికాదని అన్నారు. అయితే అదే సమయంలో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు కూడా చేపట్టింది. వెంటనే సీఎం అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఏడాదిలోగా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంక్‌ రుణం ద్వారా రూ.6,400 కోట్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్లు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

ఓడరేవులపై జరిగిన చర్చలో కీలకాంశాలు..
– 2 సంవత్సరాల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్ణయం. తొలిదశలో రూ.2,647 కోట్లతో నాలుగు బెర్తుల నిర్మాణం. అక్టోబరు 1 నుంచి పోర్టు పనులు, నవంబర్‌ మొదటి వారంలో బ్రేక్‌ వాటర్‌ పనులు ప్రారంభం.
– అక్టోబర్‌ నెలాఖరుకు భావనపాడు పోర్టు టెండర్ల ప్రక్రియ పూర్తి. మొదటి దశలో రూ.2,956 కోట్లతో 10లక్షల టన్నుల కార్గో రవాణాకు ఏర్పాట్లు.
– మచిలీపట్నం పోర్టులో తొలి దశలో రూ.3,650 కోట్ల వ్యయంతో 3.5 కోట్ల టన్నుల కార్గో రవాణాకు సదుపాయాలు.
– ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వల దిన్నె వద్ద నిర్మిస్తున్న ఫిషింగ్‌ హార్బర్ల పనులు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి. రెండో విడతలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నం, వాడరేవుల వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి సన్నాహాలు.

First Published:  6 Sep 2021 10:43 PM GMT
Next Story