Telugu Global
Health & Life Style

మిలిటరీ డైట్ గురించి తెలుసా?

బరువు తగ్గడం కోసం ఒక్కొక్కరు ఒక్కో డైట్ ను పాటిస్తుంటారు. అయితే ఈ మధ్య మిలటరీ డైట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఈ డైట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. ఈ డైట్ తో ఒక వారంలోనే 4 నుంచి 5 కేజీలు తగ్గొచ్చని చెప్తున్నారు. అసలీ డైట్ ఎలా ఉంటుందంటే.. మిలిటరీ డైట్ ప్లాన్ అనేది వేగంగా బరువు తగ్గించే డైట్. సైనికులను తక్కువ కాలంలో మంచి షేప్ లోకి తీసుకురావడానికి యుఎస్ […]

మిలిటరీ డైట్ గురించి తెలుసా?
X

బరువు తగ్గడం కోసం ఒక్కొక్కరు ఒక్కో డైట్ ను పాటిస్తుంటారు. అయితే ఈ మధ్య మిలటరీ డైట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఈ డైట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. ఈ డైట్ తో ఒక వారంలోనే 4 నుంచి 5 కేజీలు తగ్గొచ్చని చెప్తున్నారు. అసలీ డైట్ ఎలా ఉంటుందంటే..

మిలిటరీ డైట్ ప్లాన్ అనేది వేగంగా బరువు తగ్గించే డైట్. సైనికులను తక్కువ కాలంలో మంచి షేప్ లోకి తీసుకురావడానికి యుఎస్ మిలిటరీతో కలిసి పనిచేసిన పోషకాహార నిపుణులు ఈ డైట్ ప్లాన్ ను రూపొందించారు.

ఈ డైట్ లో 3 రోజులు సూచించిన ఆహారాన్ని అనుసరించాలి. తర్వాత 4 రోజుల విశ్రాంతి తీసుకోవాలి. అనుకున్నంత బరువు తగ్గే వరకు ఇదే సైకిల్ ను ఫాలో అవ్వాలి. ఈ డైట్ కేలరీల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి, వేగంగా బరువు తగ్గేలా చేస్తుంది.

వారం రోజుల డైట్ సైకిల్ ను రెండు భాగాలుగా విభజిస్తారు. మొదటి 3 రోజులలో.. రోజుకి మూడు సార్లు తింటూ 1100 నుంచి-1400 కేలరీలను తీసుకోవాలి. మధ్యలో ఎలాంటి స్నాక్స్ తినకూడదు. ఇలా మూడు రోజులు పూర్తయిన తర్వాత, వారంలో మిగతా 4 రోజులు ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే తక్కువ కేలరీలు ఉండే ఫుడ్ తీసుకోవడం ఉత్తమం.

ఇలా డైట్ ను కంటిన్యూ చేయడం ద్వారా వారానికి 4.5 కిలోల వరకు బరువు తగ్గొచ్చని డైట్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. ఇక ఇందులో తీసుకోవాల్సిన ఆహారం విషయానికొస్తే.. దాదాపు అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు. పిండి పదార్థాలు, ఫైబర్, కొవ్వులు, ప్రోటీన్లు లేదా విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

ఈ డైట్ ను ఎంతో మంది ఫాలో అవుతున్నా.. దీనిపై కొన్ని నెగెటివ్ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. వేగంగా బరువు తగ్గించే డైట్ లు అంత మంచివి కావని, ఇవి దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని కొందరి వాదన.

First Published:  7 Sep 2021 2:11 AM GMT
Next Story