Telugu Global
International

కో ఎడ్యుకేషన్ విత్ పరదా.. ఆఫ్ఘన్ లో కొత్త సంస్కృతి..

ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన మొదలవుతుందన్న దశలో ఆడవారి విద్యపై అనేక అనుమానాలు ముసురుకున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఇకపై ఆడవారు చదువుకోలేరని, బయటకు రాలేరని, స్త్రీ స్వేచ్ఛ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో పూర్తిగా కనుమరుగైపోతుందని అనుకున్నారు. కానీ మలి విడత తాలిబన్లు కాస్త మారినట్టు కనిపిస్తున్నారు. మహిళల చదువుకి అనుమతి ఇస్తూనే.. అనేక ఆంక్షలు పెట్టారు. ఈ ఆంక్షలను ప్రతిబింబించే ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కో ఎడ్యుకేషన్ కి ఓకే.. […]

కో ఎడ్యుకేషన్ విత్ పరదా.. ఆఫ్ఘన్ లో కొత్త సంస్కృతి..
X

ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన మొదలవుతుందన్న దశలో ఆడవారి విద్యపై అనేక అనుమానాలు ముసురుకున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఇకపై ఆడవారు చదువుకోలేరని, బయటకు రాలేరని, స్త్రీ స్వేచ్ఛ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో పూర్తిగా కనుమరుగైపోతుందని అనుకున్నారు. కానీ మలి విడత తాలిబన్లు కాస్త మారినట్టు కనిపిస్తున్నారు. మహిళల చదువుకి అనుమతి ఇస్తూనే.. అనేక ఆంక్షలు పెట్టారు. ఈ ఆంక్షలను ప్రతిబింబించే ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కో ఎడ్యుకేషన్ కి ఓకే.. కానీ..
మహిళల విద్యను అడ్డుకోబోమన్న తాలిబన్లు, మొదట్లో కో ఎడ్యుకేషన్ ని పూర్తిగా వద్దని చెప్పారు. అయితే తర్వాతి రోజుల్లో కొన్ని ఆంక్షలతో అనుమతించారు. తాలిబన్‌ ఎడ్యుకేషన్‌ అథారిటీ.. దేశంలోని విద్యాసంస్థలకు ఇటీవల కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు యూనివర్శిటీలకు వెళ్లే యువతులు తప్పనిసరిగా బుర్ఖా, నిఖాబ్‌ ధరించాలని తాలిబన్లు ఆదేశించారు. యువతీ యువకులకు వేర్వేరు తరగతి గదుల్లో బోధించాలని చెప్పారు. అది కుదరకపోతే కనీసం వారి మధ్య కర్టెన్‌ వేయాలని ఆదేశించారు. ఇలా పరదా పద్ధతిలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో బోధన జరుగుతోంది. కాలేజీ అయిపోయిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలు ఒకేసారి బయటకు వెళ్లకూడదు. ఒకే సమయంలో వెళ్తే కాలేజీ బయట కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ వారు మాట్లాడుకునే అవకాశముంటుందనే ఉద్దేశంతో ఇలా ఆంక్షలు విధించారు. ముందు అబ్బాయిలంతా బయటకు వెళ్లిపోయిన తర్వాత అమ్మాయిలను పంపించాలని ఆదేశించారు.

అమ్మాయిల కాలేజీల్లో సవాలక్ష ఆంక్షలు..
మహిళా కాలేజీలు, యూనివర్శిటీల్లో పురుష ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఉండకూడదు. ఒకవేళ తప్పనిసరి అయితే రిటైర్మెంట్ వయసున్నవారినే బోధనకు ఉపయోగించాలి. మహిళా కాలేజీల్లో.. సెక్యూరిటీ నుంచి ప్రిన్సిపల్ వరకు అందరూ మహిళలే ఉండాలి. నిబంధనలు తప్పితే కఠిన చర్యలుంటాయని తాలిబన్లు హెచ్చరించారు.

మహిళల హక్కులను గౌరవిస్తామని చెప్పిన తాలిబన్లు, తీరా ఇప్పుడు తమ సహజసిద్ధ అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారని విమర్శలు మొదలయ్యాయి. అయితే పూర్తిగా మహిళలను చిన్నచూపు చూడకుండా.. ఇలా ఆంక్షలతో అయినా చదువుకునే అవకాశమిచ్చినందుకు తాలిబన్ల చర్యలను కొంతమంది సమర్థించడం విశేషం.

First Published:  6 Sep 2021 10:10 PM GMT
Next Story