Telugu Global
NEWS

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? ఎందుకీ గందరగోళం..

హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? కొండా సురేఖ అభ్యర్థిత్వం ఖరారైపోయిందనుకున్న దశలో మళ్లీ అప్లికేషన్లు తీసుకోవడం ఏంటి..? పోనీ తీసుకున్నారు సరే.. అభ్యర్థి అనుకుంటున్న సురేఖ అధినాయకత్వానికి దరఖాస్తు చేసుకోకపోవడం ఏంటి..? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ ఆల్రడీ దూసుకుపోతున్నాయి. మరి అభ్యర్థి ఎవరో చెప్పకుండా కాంగ్రెస్ ఎన్ని సభలు పెట్టినా ఏం లాభం..? తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపికైన తర్వాత కాంగ్రెస్ లో […]

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? ఎందుకీ గందరగోళం..
X

హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? కొండా సురేఖ అభ్యర్థిత్వం ఖరారైపోయిందనుకున్న దశలో మళ్లీ అప్లికేషన్లు తీసుకోవడం ఏంటి..? పోనీ తీసుకున్నారు సరే.. అభ్యర్థి అనుకుంటున్న సురేఖ అధినాయకత్వానికి దరఖాస్తు చేసుకోకపోవడం ఏంటి..? అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ ఆల్రడీ దూసుకుపోతున్నాయి. మరి అభ్యర్థి ఎవరో చెప్పకుండా కాంగ్రెస్ ఎన్ని సభలు పెట్టినా ఏం లాభం..?

తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపికైన తర్వాత కాంగ్రెస్ లో హడావిడి బాగా పెరిగింది. అప్పటి వరకు రేవంత్ ని వ్యతిరేకించిన వర్గం కూడా కొంత సర్దుబాటు చేసుకుంది. మిగతావారు అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఈ సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి సవాల్ గా మారింది. అప్పటి వరకు అక్కడ రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తనదే విజయం అంటున్నారు. అధికార టీఆర్ఎస్ విజయంకోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ప్లేటు ఫిరాయించడంతో బలమైన అభ్యర్థిని వెదుక్కోవాల్సిన అవసరం హస్తం పార్టీకి వచ్చింది. అంతే కాదు హుజురాబాద్ ఉప ఎన్నికలతో తన ఇమేజ్ పెంచుకోవాల్సిన అవసరం కూడా రేవంత్ రెడ్డికి ఉంది. ఈ దశలో సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఛాయిస్ గా చెప్పుకున్నారు. ఎంపిక కమిటీ కూడా ఆమె పేరు ఖరారు చేసిందని, ఇక ప్రకటనే తరువాయి అనుకున్నారు.

ఈలోగా కొండా సురేఖ స్థానికత తెరపైకి వచ్చింది. స్థానిక నాయకురాలు కాకపోవడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని కొంతమంది వ్యతిరేకించారు. దీంతో ఆమె కూడా ఓ దశలో లోకల్ పాలిటిక్స్ తో విసుగు చెంది మౌనంగా ఉన్నారు. హుజూరాబాద్ అభ్యర్థిగా దరఖాస్తు చేయడానికి ఆమె నిరాకరించారు. దీంతో లిస్ట్ లో కొండా సురేఖ లేకుండా మొత్తం 18 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. 11 మంది స్థానికులు, ఏడుగురు స్థానికేతరులు దరఖాస్తు చేసుకున్నట్టు పీసీసీ తెలిపింది. దరఖాస్తు గడువు ముగిసినా అభ్యర్థులంటూ ప్రచారం జరిగిన మాజీ మంత్రి కొండా సురేఖ, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఎందుకు అప్లికేషన్ పెట్టలేదు. పోనీ వారిద్దరిలో ఒకరికి సీటు ఖాయమైతే.. ఈ దరఖాస్తుల ప్రహసనం ఏంటి..? రేవంత్ రెడ్డి సభలతో కాస్త గాభరా పడ్డ టీఆర్ఎస్ కూడా.. అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత రాజకీయాలు చూసి సెటైర్లు వేస్తోంది.

First Published:  5 Sep 2021 8:43 PM GMT
Next Story