Telugu Global
NEWS

ఏపీ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్..!

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి సలహాదారులను నియమించుకుంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ ను నియమించింది. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆయన క్యాబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్లపాటు పనిచేయనున్నారు. నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, రైతు భరోసా, చేయూత, వాహన మిత్ర, నేతన్న నేస్తం వంటి పథకాల ద్వారా నేరుగా […]

ఏపీ ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్..!
X

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి సలహాదారులను నియమించుకుంది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా రజనీష్ కుమార్ ను నియమించింది. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆయన క్యాబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్లపాటు పనిచేయనున్నారు.

నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, రైతు భరోసా, చేయూత, వాహన మిత్ర, నేతన్న నేస్తం వంటి పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఏడాదికి ఒకసారి నగదు జమ చేస్తోంది. అలాగే నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏడాదికి రూ. 10 వేల చొప్పున సాయం అందజేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సాయం అందించే వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా.. వీటి పర్యవేక్షణకు ఇప్పటికే ప్రభుత్వం పలువురిని సలహాదారులుగా నియమించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు చూసుకునేందుకు మరో సలహాదారు ఉంటే బాగుంటుందని భావించిన ప్రభుత్వం తాజాగా రజనీష్ కుమార్ ను నియమించింది.

రజనీష్ కుమార్ కు గతంలో ఇంగ్లాండ్, కెనడా లోని పలు ఆర్థిక సంస్థల్లో విధులు నిర్వహించిన అనుభవం ఉంది. ఫిన్ టెక్ సంస్థల్లో నిపుణుడిగా కూడా ఆయన వ్యవహరించారు. పలు ఆర్థిక సంస్థల్లో రజనీష్ కుమార్ కు ఉన్న అనుభవం నేపథ్యంలో ఆయనను రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.

First Published:  6 Sep 2021 1:03 AM GMT
Next Story