Telugu Global
Health & Life Style

అతిగా తింటే డేంజరే!

గత రెండేళ్లుగా ప్రజల ఆరోగ్యం, లైఫ్ స్టైల్స్ లో చాలా మార్పులొచ్చాయన్న సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగానే ప్రస్తుతం చాలామంది బరువు పెరిగి, టైప్2 డయాబెటిస్ బారిన పడుతున్నట్టు ఓ స్టడీలో వెల్లడైంది. లాక్‌డౌన్‌ల వల్ల అనేక మంది బరువు పెరిగారని, ఫలితంగా వారికి టైప్‌-2 డయాబెటిస్ ముప్పు ఎక్కువైందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. ‘ది లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’ జర్నల్ లో ప్రచురితమైన ఈ స్టడీలో తెలిసిందేంటంటే.. బ్రిటన్‌లోని ‘నేషనల్‌ హెల్త్‌ […]

అతిగా తింటే డేంజరే!
X

గత రెండేళ్లుగా ప్రజల ఆరోగ్యం, లైఫ్ స్టైల్స్ లో చాలా మార్పులొచ్చాయన్న సంగతి తెలిసిందే. అయితే అందులో భాగంగానే ప్రస్తుతం చాలామంది బరువు పెరిగి, టైప్2 డయాబెటిస్ బారిన పడుతున్నట్టు ఓ స్టడీలో వెల్లడైంది.

లాక్‌డౌన్‌ల వల్ల అనేక మంది బరువు పెరిగారని, ఫలితంగా వారికి టైప్‌-2 డయాబెటిస్ ముప్పు ఎక్కువైందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. ‘ది లాన్సెట్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలజీ’ జర్నల్ లో ప్రచురితమైన ఈ స్టడీలో తెలిసిందేంటంటే..

బ్రిటన్‌లోని ‘నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌’ సంస్థ మధుమేహ నివారణ కార్యక్రమంలో భాగంగా40 ఏళ్లలోపు వారిపై అధ్యయనం చేపట్టింది. అయితే సరిగ్గా మూడేళ్ల ముందు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వారితో పోలిస్తే ఇప్పుడు పాల్గొన్న వారి బరువు సరాసరిన 3.6 కిలోల మేర పెరిగినట్లు ఆ స్టడీలో తెలిసింది. లాక్ డౌన్ కారణంగా చాలామంది బరువు పెరగడంతో పాటు టైప్‌-2 డయాబెటిస్, క్యాన్సర్, గుండె పోటు, పక్షవాతం వంటి వాటి ముప్పును ఎదుర్కొంటున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. టైప్‌-2 డయాబెటిస్ అనేది దీర్ఘకాలం వేధించే సమస్య. బరువు పెరగడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం 80 శాతం మేర పెరుగుతుంది.
లాక్ డౌన్ లో చాలామంది వైరస్‌ సోకకుండా ఉండేందుకు పౌష్టికాహారం పేరుతో ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు. దాంతోపాటు ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం కూడా బరువు పెరగడానికి మరో కారణం. నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ అంచనాల ప్రకారం ఒక కిలో బరువు పెరిగితే డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం 8 శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏం తింటున్నాం అన్నది పక్కన పెడితే.. ఎంత తింటున్నాం అన్ని ఓ సారి చెక్ చేసుకోవాలి. వాస్తవానికి రోజంతా ఇంటికే పరిమితమయ్యే వాళ్లు కాస్త తక్కువ ఫుడ్ తీసుకోవడమే మంచిది. రోజువారీ శారీరక శ్రమను బట్టి ఆహారం క్వాంటిటీని కంట్రోల్ చేస్తూ ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

First Published:  5 Sep 2021 2:15 AM GMT
Next Story