Telugu Global
Cinema & Entertainment

ముంబయిలో చెన్నై సాంబార్

చెన్నై వచ్చి ముంబయి రుచులు కోరుకుంటే కష్టం. అలాగే ముంబయి వెళ్లి చెన్నై సాంబార్ కావాలన్నా కష్టమే. శృతిహాసన్ కు ఈ ఇబ్బంది చాలా ఏళ్లుగా ఉంది. ఇదే విషయాన్ని బయటపెట్టింది శృతిహాసన్. చెన్నై సాంబార్ ను, ఆంధ్రా పప్పును తెగ మిస్ అవుతున్నట్టు తెలిపింది. శృతిహాసన్ ఎక్కువగా ముంబయిలోనే ఉంటుంది. అక్కడ ఆమె ఓ ఫ్లాట్ కూడా కొనుక్కుంది. అందులోనే అన్నీ. హైదరాబాద్, చెన్నైలో షూటింగ్స్ ఉన్నప్పటికీ షెడ్యూల్స్ పూర్తిచేసి తిరిగి ముంబయి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో స్థానిక వంటకాల్ని […]

ముంబయిలో చెన్నై సాంబార్
X

చెన్నై వచ్చి ముంబయి రుచులు కోరుకుంటే కష్టం. అలాగే ముంబయి వెళ్లి చెన్నై సాంబార్ కావాలన్నా కష్టమే. శృతిహాసన్ కు ఈ ఇబ్బంది చాలా ఏళ్లుగా ఉంది. ఇదే విషయాన్ని బయటపెట్టింది శృతిహాసన్. చెన్నై సాంబార్ ను, ఆంధ్రా పప్పును తెగ మిస్ అవుతున్నట్టు తెలిపింది.

శృతిహాసన్ ఎక్కువగా ముంబయిలోనే ఉంటుంది. అక్కడ ఆమె ఓ ఫ్లాట్ కూడా కొనుక్కుంది. అందులోనే
అన్నీ. హైదరాబాద్, చెన్నైలో షూటింగ్స్ ఉన్నప్పటికీ షెడ్యూల్స్ పూర్తిచేసి తిరిగి ముంబయి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో స్థానిక వంటకాల్ని బాగా మిస్ అవుతోంది శృతిహాసన్.

అందుకే ముంబయిలో చెన్నై సాంబార్ దొరికే ఓ రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనను
బయటపెట్టింది శృతిహాసన్. ఒకవేళ తను ముంబయిలో సౌత్ ఇండియన్ రెస్టారెంట్ పెడితే, అందులో కేవలం చెన్నై సాంబార్, ఆంధ్ర పప్పు లాంటి ఐదారు రకాలు మాత్రమే ఉంటాయని చెబుతోంది.

ఇక తన ఆహారపు అభిరుచుల విషయానికొస్తే.. యూరోప్, ఆసియా, ఇండియన్, టర్కీ ఇలా ఎన్నో రకాల
రుచుల్ని తను టేస్ట్ చేశానని.. కానీ సాంబార్, పప్పు ఉంటే తనకు చాలని, జీవితాంతం బతికేస్తానని
చెబుతోంది శృతిహాసన్.

First Published:  4 Sep 2021 9:34 AM GMT
Next Story