Telugu Global
Cinema & Entertainment

శృతిహాసన్ కొత్త సినిమా రెడీ

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత ‘వైజాగ్’ సతీష్ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విజ‌య్ […]

శృతిహాసన్ కొత్త సినిమా రెడీ
X

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో
రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు
పోషించారు. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై
నిర్మాత ‘వైజాగ్’ సతీష్ తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.

అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుద‌ల
చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేశారు. తెలుగులో ఈ ట్రయిలర్ కు ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.

వకీల్ సాబ్ తర్వాత శృతిహాసన్ నుంచి తెలుగులో విడుదలవుతున్న సినిమా ఇదే. అటు విజయ్ సేతుపతి
ఈమధ్య కాలంలో 2-3 డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు. మరోవైపు ఉప్పెన సినిమా
అతడికి తెలుగులో మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసి లాభం సినిమా లాభాలు
తెచ్చిపెడుతుందని నిర్మాత నమ్ముతున్నాడు.

First Published:  4 Sep 2021 9:02 AM GMT
Next Story