Telugu Global
Cinema & Entertainment

రొమాంటిక్ గా సెన్సార్ పూర్తి

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరి తదుపరి చిత్రం `రొమాంటిక్` కోసం కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లపై పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో కేతికా శర్మను ఆకాష్ […]

రొమాంటిక్ గా సెన్సార్ పూర్తి
X

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరి తదుపరి చిత్రం 'రొమాంటిక్' కోసం కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లపై పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఎలాంటి క‌ట్స్ చెప్ప‌కుండా సెన్సార్ వారు ఈ చిత్రానికి
యు/ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో కేతికా శర్మను ఆకాష్ వెన‌క నుండి
కౌగిలించుకోవడం చూడొచ్చు. ఇది సినిమా టైటిల్‌ను జ‌స్టిఫై చేస్తుంది. త్వ‌ర‌లో ఈ మూవీని థియేట‌ర్స్‌లో
విడుద‌ల చేయ‌నున్నారు మేక‌ర్స్‌.

రమ్య‌కృష్ట ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఇంటెన్స్ రొమింటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్య‌ప్ సంగీతం అందించాడు. న‌రేష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలకు విశేష‌ స్పందన వచ్చింది. దాంతో పాటు ఇప్ప‌టివ‌ర‌కు రిలీజైన అన్ని పోస్టర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సినిమాపై మంచి బ‌జ్‌ని క్రియేట్ చేశాయి.

First Published:  4 Sep 2021 9:24 AM GMT
Next Story