Telugu Global
Cinema & Entertainment

ఈసారి కూడా రీమేక్ మూవీనే

తన పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ తళ్లూరి నిర్మాణంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు పవన్. అయితే ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ చిన్న మెలిక పెట్టాడు పవన్ కల్యాణ్. కేవలం 3 నెలల్లో సినిమాను పూర్తిచేయాలనేది ఆ షరతు. నిజానికి మైత్రీ మూవీ మేకర్స్ కంటే ముందే రామ్ తళ్లూరికి సినిమా చేయాలి పవన్. అందుకే హరిహర వీరమల్లు సినిమా పూర్తవ్వగానే.. నేరుగా 3 నెలల […]

ఈసారి కూడా రీమేక్ మూవీనే
X

తన పుట్టినరోజు సందర్భంగా పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ తళ్లూరి
నిర్మాణంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు పవన్. అయితే ఇప్పుడీ ప్రాజెక్టుకు
సంబంధించి ఓ చిన్న మెలిక పెట్టాడు పవన్ కల్యాణ్. కేవలం 3 నెలల్లో సినిమాను పూర్తిచేయాలనేది ఆ
షరతు.

నిజానికి మైత్రీ మూవీ మేకర్స్ కంటే ముందే రామ్ తళ్లూరికి సినిమా చేయాలి పవన్. అందుకే హరిహర
వీరమల్లు సినిమా పూర్తవ్వగానే.. నేరుగా 3 నెలల కాల్షీట్లు ఇవ్వడానికి రెడీ అయ్యాడట పవన్. ఆ 3 నెలల
తర్వాత హరీశ్ శంకర్ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవ్వాలనేది ప్లాన్.

దీంతో రామ్ తళ్లూరి ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. సురేందర్ రెడ్డి దగ్గర ఒరిజినల్ స్టోరీ ఉంది. దాన్ని
పెట్టుకొని, స్టోరీ డిస్కషన్లు పూర్తిచేసి 3 నెలల్లో పూర్తిచేయడం కష్టం. రీసెంట్ గా బయటకు వదిలిన పోస్టర్ లో కూడా ఒరిజినల్ స్టోరీకి సంబంధించిన ఎలిమెంట్సే చూపించారు.

ఈ స్టోరీతోనే సెట్స్ పైకి వెళ్లాలనుకుంటే హరీష్ శంకర్ సినిమా పూర్తయ్యేవరకు ఆగాల్సిందే. హరీష్ సినిమా
కంటే ముందే సెట్స్ పైకి రావాలనుకుంటే మాత్రం రీమేక్ చేయాల్సిందే. మరి రామ్ తళ్లూరి, సురేందర్ రెడ్డి కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

First Published:  4 Sep 2021 9:32 AM GMT
Next Story