Telugu Global
NEWS

బెంగాల్, ఒడిశాలో సై.. తెలుగు రాష్ట్రాల్లో నై..

దేశవ్యాప్తంగా 3 లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాటిలో కొన్నిటికి మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 30న పశ్చిమబెంగాల్, ఒడిశాలోని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపేందుకు సీఈసీ నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉప ఎన్నికలను రెండు నెలలు పైగా వాయిదా వేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకే ఉప ఎన్నికలను వాయిదా వేసినట్టు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. […]

బెంగాల్, ఒడిశాలో సై.. తెలుగు రాష్ట్రాల్లో నై..
X

దేశవ్యాప్తంగా 3 లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వాటిలో కొన్నిటికి మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 30న పశ్చిమబెంగాల్, ఒడిశాలోని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపేందుకు సీఈసీ నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉప ఎన్నికలను రెండు నెలలు పైగా వాయిదా వేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకే ఉప ఎన్నికలను వాయిదా వేసినట్టు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.

మమత టీమ్ సంతోషం..
ఎన్నికల నిర్వహణపై ఈ నెల 1న 12 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో సీఈసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంది. పశ్చిమబెంగాల్‌ లో 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. నందిగ్రామ్ లో ఓడిపోయిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా.. నవంబర్ 5లోపు తిరిగి శాసన సభకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో ఉప ఎన్నికలకోసం తృణమూల్ కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఈనెల 30న బైపోల్ కి సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 30న వెస్ట్ బెంగాల్ లోని భవానీపూర్‌, జంగీపూర్‌, శంషేర్‌ గంజ్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ వెల్లడించింది. అదే రోజున ఒడిశాలోని పిప్లి అసెంబ్లీకి ఎన్నికలు జరపబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో మరింత ఆలస్యం..
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజన్ ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు తెలిపింది. అక్టోబర్‌ చివరి వారం లేదా నవంబర్ లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశముంది. ఏపీలోని బద్వేల్‌ ఉప ఎన్నిక కూడా దసరా తర్వాతే ఉంటుందని తెలిపింది. ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు ఈసీ వెల్లడించింది.

First Published:  4 Sep 2021 10:08 AM GMT
Next Story