Telugu Global
NEWS

ఏపీలో వినాయక చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం..

వినాయక చవితి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చవితి ఉత్సవాలను కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు వద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కొవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌ పై సమీక్ష నిర్వహించారు. చవితి ఉత్సవాలపై ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. […]

ఏపీలో వినాయక చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం..
X

వినాయక చవితి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చవితి ఉత్సవాలను కేవలం ఇళ్లకే పరిమితం చేసింది. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు వద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కొవిడ్‌ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌ పై సమీక్ష నిర్వహించారు. చవితి ఉత్సవాలపై ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే కేరళలో బక్రీద్, ఓనమ్ పండగలకు వెసులుబాటు ఇవ్వడంతో కరోనా కేసులు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70శాతం కేరళలోనే వెలుగు చూస్తున్నాయి. ఈ దశలో వినాయక చవితి ఉత్సవాలు, ఈరేగింపులు, నిమజ్జన సంబరాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి. ఎక్కడికక్కడ కట్టడి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. చవితికి రెండు నెలల ముందుగానే భారీ వినాయక ప్రతిమల తయారీ ఊపందుకునేది. ఈ ఏడాది సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్నా భారీ విగ్రహాల తయారీకి అధికారులు అనుమతివ్వలేదు. తాజాగా ఇప్పుడు వినాయక మండపాల ఏర్పాటు, బహిరంగ స్థలాల్లో పూజలకు కూడా ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. పండగను సంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రజలకు సూచిస్తోంది.

కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి పూట అమలు చేస్తోన్న కర్ఫ్యూను మరి కొంత కాలం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రమంతా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లోకల్ లాక్ డౌన్ కనసాగుతున్నా.. 13 జిల్లాల్లో కామన్ గా.. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.

ఏపీలో 18 ఏళ్లు నిండిన వారందరికీ 2022 ఫిబ్రవరి నాటికి వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.11కి తగ్గిందని చెప్పారు. పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్నా కూడా నైట్ కర్ఫ్యూ కొనసాగించడానికే ప్రభుత్వం మొగ్గుచూపింది. వినాయక చవితి సంబరాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించింది.

First Published:  2 Sep 2021 9:27 PM GMT
Next Story