Telugu Global
NEWS

సామూహిక నిమజ్జనం చాలు.. స్థానిక నిమజ్జనం మేలు..

వినాయక విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ కలుషితమైపోతోందని, నిమజ్జనంపై ఆంక్షలు విధించాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. హుస్సేన్ సాగర్ లో సామూహిక నిమజ్జనం కంటే.. ఎక్కడికక్కడ స్థానిక జలవనరుల్లో నిమజ్జనం మేలని సూచించింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 6కి వాయిదా వేసింది. అదే రోజు తుది ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది హైకోర్టు. గతంలో కూడా వినాయక విగ్రహాల […]

సామూహిక నిమజ్జనం చాలు.. స్థానిక నిమజ్జనం మేలు..
X

వినాయక విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ కలుషితమైపోతోందని, నిమజ్జనంపై ఆంక్షలు విధించాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. హుస్సేన్ సాగర్ లో సామూహిక నిమజ్జనం కంటే.. ఎక్కడికక్కడ స్థానిక జలవనరుల్లో నిమజ్జనం మేలని సూచించింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 6కి వాయిదా వేసింది. అదే రోజు తుది ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది హైకోర్టు.

గతంలో కూడా వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిసారీ చివరి నిమిషంలో ఆంక్షలు సడలించడం, యధావిధిగా నిమజ్జనం జరగడం చూస్తూనే ఉన్నామని, ఈసారయినా కాస్త ముందుగా అధికారులు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. హుస్సేన్ సాగర్ ​లో విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్ ​పై విచారణ జరిపిన కోర్టు, నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ చర్యలు సూచించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్.. దీనికి సంబంధించిన నివేదికలు సమర్పించాలని చెప్పింది. కోవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. ప్రజల సెంటిమెంట్​ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పింది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందన్న హైకోర్టు… సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలంది.

పండగ వేళ కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..
కేరళలో బక్రీద్, ఓనమ్ పండగల కారణంగా నిబంధనలు పూర్తిగా సడలించడంతో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండగ వేళ, నవరాత్రుల సందర్భంగా.. ఆంక్షలు ఎత్తివేస్తే కచ్చితంగా కోవిడ్ విజృంభించడానికి అవకాశమిచ్చినట్టు లెక్క. అందుకే ఎక్కడికక్కడ అధికారులు కోవిడ్ నిబంధనలపై మరోసారి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. హడావిడి లేకుండా పండగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. అటు కోర్టులు కూడా ఈ విషయాలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాయి.

First Published:  1 Sep 2021 6:06 AM GMT
Next Story