Telugu Global
NEWS

కర్నూలులో హెచ్ఆర్సీ ఏర్పాటుపై స్టే ఇవ్వలేం -హైకోర్టు

కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ఇప్పటికే ఏర్పాటైంది. ఇదే కోవలో.. ఈ రోజు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం కూడా కర్నూలు కేంద్రంగా ప్రారంభం కాబోతోంది. అయితే చివరి నిమిషంలో దీనిపై కోర్టు విచారణ చేపట్టడంతో అందరిలో కాస్త ఉత్కంఠ నెలకొంది. స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆ ఉత్కంఠ వీడిపోయింది. హెచ్ఆర్సీ ఏర్పాటుని అడ్డుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించిన […]

కర్నూలులో హెచ్ఆర్సీ ఏర్పాటుపై స్టే ఇవ్వలేం -హైకోర్టు
X

కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ఇప్పటికే ఏర్పాటైంది. ఇదే కోవలో.. ఈ రోజు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం కూడా కర్నూలు కేంద్రంగా ప్రారంభం కాబోతోంది. అయితే చివరి నిమిషంలో దీనిపై కోర్టు విచారణ చేపట్టడంతో అందరిలో కాస్త ఉత్కంఠ నెలకొంది. స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆ ఉత్కంఠ వీడిపోయింది. హెచ్ఆర్సీ ఏర్పాటుని అడ్డుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు.. తుది తీర్పుకి లోబడి ఆయా కార్యాలయాల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేసింది. కేసుని అక్టోబర్-5కి వాయిదా వేసింది.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనిపై కోర్టు కేసుల కారణంగా కార్యాలయాల తరలింపుపై సందిగ్ధత నెలకొంది. అమరావతినుంచి కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించడంలో కోర్టు కేసులతో ఇబ్బందులున్నాయి. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఇంకా హైదరాబాద్ లోనే ఉండిపోయిన లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలను నేరుగా కర్నూలుకు తరలించేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది. దీనికి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆగస్ట్ 28న కర్నూలులో లోకాయుక్త కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ రూమ్ నెంబర్-3లో ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్-1న హెచ్ఆర్సీ ప్రారంభోత్సవం ఉంది. అయితే ఈలోగా.. అమరావతి జేఏసీ నాయకులు కోర్టు మెట్లెక్కారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించేలా కోర్టులో కేసులు నడుస్తున్నందున కర్నూలుకి హెచ్ఆర్సీ తరలింపు అక్రమం అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు హెచ్ఆర్సీ ఏర్పాటు నిలువరించేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. ఇదే వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సీఎం, ఇతర మంత్రులకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది.

లోకాయుక్త, హెచ్‌ఆర్సీని కర్నూలులో ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణాలున్నాయని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకి విన్నవించారు. పాలన వికేంద్రీకరణ చట్టానికీ కర్నూలులో ఆయా కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సంబంధం లేదని చెప్పారు. లోకాయుక్త, హెచ్ఆర్సీకి కర్నూలు ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఈ రెండు సంస్థలు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లయినా కూడా ఫిర్యాదులు స్వీకరించవచ్చని తెలిపారు.

First Published:  31 Aug 2021 8:13 PM GMT
Next Story