Telugu Global
National

డెల్టాను తలదన్నే కరోనా కొత్త వేరియంట్ ఇదే..

డెల్టా, డెల్టా ప్లస్ అంటూ కొత్తగా వచ్చిన కరోనా వేరియంట్లు తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించిన వేళ.. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ కి ముగింపు పలుకుతూ భారత్ లో జనజీవనం సాధారణ స్థాయికి చేరుకుంటోంది. కొత్త వేరియంట్ వస్తేనే భారత్ లో థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సహా పలు ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ జాడ కనపడినట్టు తెలుస్తోంది. సి-1.2 గా దీనికి పేరు పెట్టారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ […]

డెల్టాను తలదన్నే కరోనా కొత్త వేరియంట్ ఇదే..
X

డెల్టా, డెల్టా ప్లస్ అంటూ కొత్తగా వచ్చిన కరోనా వేరియంట్లు తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించిన వేళ.. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ కి ముగింపు పలుకుతూ భారత్ లో జనజీవనం సాధారణ స్థాయికి చేరుకుంటోంది. కొత్త వేరియంట్ వస్తేనే భారత్ లో థర్డ్ వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సహా పలు ఇతర దేశాల్లో కొత్త వేరియంట్ జాడ కనపడినట్టు తెలుస్తోంది. సి-1.2 గా దీనికి పేరు పెట్టారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌(NICD) సైంటిస్టులు ఈ వైరస్ ని గుర్తించారు. మే నెలలోనే ఈ వేరియంట్‌ ని గుర్తించినా.. ఆగస్ట్ నాటికి చైనా, కాంగో, మారిషస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌ లో దీని జాడలు కనిపించాయని హెచ్చరించారు.

ఈ కొత్త వైరస్‌, కరోనా టీకాలు కల్పించే రక్షణను కూడా దాటుకుని శరీరంలోకి చొచ్చుకుపోతుందని హెచ్చరించారు NICD సైంటిస్టులు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన ఇతర వేరియంట్లతో పోలిస్తే ఈ సి-1.2 లో అధిక మ్యుటేషన్లు ఉన్నాయని చెప్పారు. దక్షిణాఫ్రికాలో ప్రతినెలా ఈ వేరియంట్‌ జీనోమ్స్‌ సంఖ్య పెరుగుతూవస్తోందని వారి అధ్యయనలో వెల్లడైంది. గతంలో బీటా, డెల్టా వేరియంట్లలో కూడా జీనోమ్స్‌ ఇలాగే పెరిగాయని, కొత్తగా కనుగొన్న వేరియంట్‌ లో మ్యుటేషన్‌ రేటు సంవత్సరానికి 41.8 శాతమని, ఇతర వేరియంట్ల మ్యుటేషన్‌ రేటు కన్నా ఇది రెట్టింపు అని ఆ అధ్యయనంలో తేలింది. అయితే కొత్త వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

కొత్త వేరియంట్ వస్తేనే భారత్ లో థర్డ్ వేవ్..
ఇప్పుడున్న కరోనా వేరియంట్ల కన్నా మరింత హాని కలిగించే డేంజర్‌ వేరియంట్‌ సెప్టెంబర్‌ లో బయటపడితే దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందని ఐఐటీ కాన్పూర్‌ సైంటిస్ట్ లు తెలిపారు. సెప్టెంబర్ లో కొత్త వేరియంట్ కేసులు మొదలైతే, అక్టోబర్‌– నవంబర్‌ మధ్య కాలంలో దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ఉధృతి కనిపిస్తుందని చెప్పారు. కొత్త వేరియంట్‌ తో వచ్చే థర్డ్‌ వేవ్‌ ఎంత ప్రమాదకరంగా ఉన్నా, దాని తీవ్రత సెకండ్‌ వేవ్‌ కన్నా తక్కువగా ఉంటుందని వారు అభిప్రాయ పడ్డారు. సెప్టెంబర్‌ నాటికి భారత్ లో కొత్త వేరియంట్ జాడ కనపడకపోతే.. ఎలాంటి థర్డ్‌ వేవ్‌ రాదని కాన్పూర్ సైంటిస్ట్ లు వెల్లడించారు.

కొత్త వేరియంట్, తద్వారా థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు భారత్ లో కేవలం 0.03 శాతం మాత్రమే ఉన్నాయని అంచనా వేశారు. ఇప్పటివరకు డెల్టాను మించిన ప్రమాదకరమైన వేరియంట్‌ ఇంకా బయటపడలేదని, ఒక వేళ, డెల్టా కారణంగానే థర్డ్‌ వేవ్‌ ఆరంభమైనా, కొత్త వేరియంట్‌ పుట్టకపోవడంతో ఉధృతి కొనసాగడం లేదని నిపుణులు భావిస్తున్నారు.

First Published:  30 Aug 2021 8:33 PM GMT
Next Story