Telugu Global
Cinema & Entertainment

ఎస్ఆర్ కళ్యాణమండపం క్లోజింగ్ కలెక్షన్

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా వసూళ్లు, ఓవరాల్ రెవెన్యూ డీటెయిల్స్ బయటకొచ్చాయి. ఫైనల్ రన్ లో ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు వరల్డ్ వైడ్ 8 కోట్ల 31 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇలా తన రెండో సినిమాకే చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. అయితే ఈ సినిమా వసూళ్లు ఇక్కడితో ఆగిపోలేదు. థియేట్రికల్ గా 8 కోట్ల 31 లక్షల రూపాయలు రాబట్టిన ఈ సినిమా..నాన్-థియేట్రికల్ […]

ఎస్ఆర్ కళ్యాణమండపం క్లోజింగ్ కలెక్షన్
X

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సినిమా వసూళ్లు, ఓవరాల్ రెవెన్యూ డీటెయిల్స్ బయటకొచ్చాయి. ఫైనల్ రన్ లో ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు వరల్డ్ వైడ్ 8 కోట్ల 31 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇలా తన రెండో సినిమాకే చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు అందుకున్నాడు కిరణ్ అబ్బవరం.

అయితే ఈ సినిమా వసూళ్లు ఇక్కడితో ఆగిపోలేదు. థియేట్రికల్ గా 8 కోట్ల 31 లక్షల రూపాయలు రాబట్టిన ఈ సినిమా..నాన్-థియేట్రికల్ కింద 5 కోట్ల రూపాయలు ఆర్జించింది. మొత్తంగా 13 కోట్ల 31 లక్షల రూపాయలు కలెక్ట్ చేసినట్టయింది. సినిమా బడ్జెట్ తో చూసుకుంటే ఇది దాదాపు రెట్టింపు మొత్తం. అంటే.. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అన్నమాట.

ఈ సినిమా సక్సెస్ తో యూనిట్ అంతా ఫుల్ జోష్ లోకి వచ్చేసింది. మరీ ముఖ్యంగా కిరణ్ అబ్బవరం
ఆనందానికి అవధుల్లేవ్. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో.. మరో మూడేళ్ల పాటు ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడు. అంతా ‘కళ్యాణమండపం’ మహత్యం.

తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఆర్ కళ్యాణమండపం క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
నైజాం: 2.94 కోట్లు

సీడెడ్: 1.15 కోట్లు

ఉత్తరాంధ్ర: 0.98 కోట్లు

ఈస్ట్: 0.51 కోట్లు

వెస్ట్: 0.35 కోట్లు

గుంటూరు: 0.69 కోట్లు

కృష్ణా: 0.42 కోట్లు

నెల్లూరు: 0.25 కోట్లు

First Published:  31 Aug 2021 8:23 AM GMT
Next Story