Telugu Global
National

చైనా అంటే ప్రేమ.. తాలిబన్లంటే భయం..

బీజేపీ ప్రభుత్వ విదేశాంగ వ్యవహారాలన్నీ రెండు నాల్కల ధోరణితో ఉన్నాయని విమర్శించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఆయా దేశాలను శత్రువులుగా చిత్రీకరిస్తూనే.. వాటితో స్నేహం కోసం తహతహలాడటం బీజేపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అఖిలపక్ష భేటీ జరిపిన ప్రధాని మోదీ, తమ విధానం ఏంటో చెప్పలేదని, అసలు మోదీకి ఒక విధానమంటూ లేదని తేల్చి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌, చైనాతో భారత విదేశాంగ పాలసీపై ప్రధాని మోదీని ఒవైసీ టార్గెట్‌ చేశారు. తాలిబన్లంటే […]

చైనా అంటే ప్రేమ.. తాలిబన్లంటే భయం..
X

బీజేపీ ప్రభుత్వ విదేశాంగ వ్యవహారాలన్నీ రెండు నాల్కల ధోరణితో ఉన్నాయని విమర్శించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఆయా దేశాలను శత్రువులుగా చిత్రీకరిస్తూనే.. వాటితో స్నేహం కోసం తహతహలాడటం బీజేపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అఖిలపక్ష భేటీ జరిపిన ప్రధాని మోదీ, తమ విధానం ఏంటో చెప్పలేదని, అసలు మోదీకి ఒక విధానమంటూ లేదని తేల్చి చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌, చైనాతో భారత విదేశాంగ పాలసీపై ప్రధాని మోదీని ఒవైసీ టార్గెట్‌ చేశారు.

తాలిబన్లంటే ఎందుకంత భయం..?
బీజేపీ నేతలు తమ ప్రత్యర్ధులంతా ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లిపోవాలని సెటైర్లు విసురుతున్నారు, కానీ ఇప్పటి వరకూ ప్రధాని మోదీ తప్ప అక్కడికి ఎవరూ వెళ్లలేదని సెటైర్లు వేశారు అసదుద్దీన్ ఒవైసీ. తమ ప్రత్యర్ధులను బీజేపీ నేతలు తాలిబన్లు అని విమర్శిస్తున్నారని, కాని తాలిబన్లు ఆక్రమించిన దేశానికి మోదీ, 3 బిలియన్‌ డాలర్ల సాయం చేసిన విషయాన్ని మరచిపోయారని అన్నారు. ప్రపంచమంతా తాలిబన్లను టెర్రరిస్ట్ లు అంటున్నా.. సోషల్ మీడియాలో బీజేపీ నేతలు తాలిబన్లపై విరుచుకు పడుతున్నా.. తాలిబన్లను ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం టెర్రరిస్టులని పిలవడం లేదని, దాని మర్మమేంటని ప్రశ్నించారు. తాలిబన్‌-2 పాలనపై మోదీ ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ విషయంలో ప్రధాని మోదీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

చైనా అంటే ఎందుకంత ప్రేమ..
ఓవైపు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని బీజేపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని అదే సమయంలో.. భారత్ తో చైనా వాణిజ్యం మోదీ హయాంలోనే రెట్టింపైందన్న విషయాన్ని మ‌ర‌చిపోతున్నార‌ని విమర్శించారు అసదుద్దీన్ ఒవైసీ. ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకున్న మోదీ ప్రభుత్వం, చైనాతో మాత్రం ఎందుకు పెంచుకోవాల్సి వచ్చిందని నిలదీశారు. విపక్ష నేతల్ని చైనా ఏజెంట్లని విమర్శించే బీజేపీకి.. మోదీకి చైనాపై ఎంత ప్రేమ ఉందో తెలియదా అని ప్రశ్నించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినప్పటికి, వాస్తవాన్ని ప్రధాని మోదీ ఒప్పుకోవడం లేదన్నారు. చైనాతో మోదీ ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందని విమర్శించారు.

First Published:  30 Aug 2021 8:53 PM GMT
Next Story