Telugu Global
NEWS

మోత్కుపల్లికి ఈసారయినా న్యాయం జరుగుతుందా..?

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. ఆమధ్య బీజేపీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు కానీ, ఆయన అంతకు మించి అన్నట్టుగా కేసీఆర్ కి మద్దతిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువగా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా దళితబంధు విషయంలో మోత్కుపల్లి చేపట్టిన నిరసన దీక్ష, దీక్ష ముగింపు సందర్భంగా ఆత్మహత్య చేసుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వం తలచుకుంటే పథకాల అమలు అసాధ్యమా..? కేసీఆర్ ప్రభుత్వం ఇటీవలే దళితబంధును ప్రకటించింది. ఆమేరకు ప్రయోగాత్మకంగా […]

మోత్కుపల్లికి ఈసారయినా న్యాయం జరుగుతుందా..?
X

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. ఆమధ్య బీజేపీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు కానీ, ఆయన అంతకు మించి అన్నట్టుగా కేసీఆర్ కి మద్దతిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల కంటే ఎక్కువగా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా దళితబంధు విషయంలో మోత్కుపల్లి చేపట్టిన నిరసన దీక్ష, దీక్ష ముగింపు సందర్భంగా ఆత్మహత్య చేసుకుంటానంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

ప్రభుత్వం తలచుకుంటే పథకాల అమలు అసాధ్యమా..?
కేసీఆర్ ప్రభుత్వం ఇటీవలే దళితబంధును ప్రకటించింది. ఆమేరకు ప్రయోగాత్మకంగా దళితులకు ఆర్థిక సాయం కూడా అందుతోంది. అయితే ఈ పథకం ఇంకా రాష్ట్రవ్యాప్తం కాలేదు. ఈమధ్యలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దళితబంధు పథకంపై విమర్శలు మొదలు పెట్టాయి. కేవలం రాజకీయ స్వలాభం కోసమే, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనే దీన్ని తెరపైకి తెచ్చారని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ ఆరోపణలు తప్పించుకోడానికి టీఆర్ఎస్ కూడా ఆపసోపాలు పడుతోంది. దళితబంధులాగానే మిగతా అన్ని వర్గాల బంధు కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు కేసీఆర్. ఈ దశలో మోత్కుపల్లి దీక్ష సంచలనంగా మారింది.

దళిత బంధుకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయంటూ హైదరాబాద్‌ లోని తన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు మోత్కుపల్లి నర్సింహులు. నిరుపేద దళితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టి దళిత బాంధవుడుగా నిలిచారని అన్నారు. ఈ పథకంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలు తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. దళిత బంధు పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నా, ఈ పథకం అమలులో ప్రభుత్వం విఫలమైనా తాను యాదగిరిగుట్టలో ఆత్మహత్య చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈసారయినా న్యాయం జరుగుతుందా..?
రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో మిగిలిపోయిన మోత్కుపల్లి నర్సింహులు చాలాకాలం ఆ పార్టీ తనకు న్యాయం చేస్తుందని ఎదురు చూశారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీడీపీ మిత్రపక్షంగా ఉండటంతో.. మోత్కుపల్లి గవర్నర్ పోస్ట్ ఆశించారు. ప్రతిసారీ గవర్నర్ల జాబితా విడుదల కావడం, అందులో ఆయన పేరు లేకపోవడంతో నొచ్చుకున్నారు. చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగరేసి.. 2018 తెలంగాణ ఎన్నికలకు ముందు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) లో చేరి ఆలేరు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. అక్కడ కూడా ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. దీంతో సరిగ్గా ఏడాదిన్నరకే ఆ పార్టీని వదిలిపెట్టారు. ఇటీవల టీఆర్ఎస్, కేసీఆర్ కి అనుకూలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలో గులాబీ కండువా కప్పుకుంటారనే విషయం అర్థమవుతోంది. పార్టీలో చేరేలోగానే, పార్టీకోసం మంచి పనులు చేయాలనుకుంటున్నారు మోత్కుపల్లి. కనీసం కేసీఆర్ అయినా తనను గుర్తిస్తారని ఆశిస్తున్నారు. ఆమధ్య మోత్కుపల్లిని దళితబంధు పథకం అమలు కమిటీకి చైర్మన్ గా నియమిస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అదే టైమ్ లో దళితబంధుకోసం ఆయన నిరాహార దీక్ష చేపట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. కనీసం టీఆర్ఎస్ లో చేరిన తర్వాత అయినా మోత్కుపల్లికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.

First Published:  29 Aug 2021 9:19 PM GMT
Next Story