Telugu Global
NEWS

పాత మంత్రులతో వైఎస్ విజయమ్మ సమావేశం? తెరవెనుక ఏం జరుగుతున్నది?

వైఎస్ విజయలక్ష్మి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆమె బయట పెద్దగా కనిపించడం లేదు. కాగా ఇప్పుడు ఆమె మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తున్నది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై త్వరలో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో వైఎస్ విజయమ్మ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ చనిపోయి 12 ఏళ్ల గడిచిపోయినా.. ఏనాడు ఆయన మంత్రివర్గంలో పని చేసిన […]

పాత మంత్రులతో వైఎస్ విజయమ్మ సమావేశం? తెరవెనుక ఏం జరుగుతున్నది?
X

వైఎస్ విజయలక్ష్మి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఆమె బయట పెద్దగా కనిపించడం లేదు. కాగా ఇప్పుడు ఆమె మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తున్నది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై త్వరలో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో వైఎస్ విజయమ్మ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ చనిపోయి 12 ఏళ్ల గడిచిపోయినా.. ఏనాడు ఆయన మంత్రివర్గంలో పని చేసిన వారితో విజయమ్మ భేటీ కాలేదు. అయితే ఇప్పుడు విజయమ్మ స్వయంగా ఆనాటి మంత్రి వర్గంలోపని చేసిన వారికి ఫోన్లు చేసి సమావేశానికి రమ్మని ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, డీ శ్రీనివాస్, కేఆర్ సురేష్ రెడ్డి వంటి నేతలను విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి తమ ఇంటికి ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. లోటస్‌పాండ్‌లో ఉన్న షర్మిల ఇంటికి రావాలని విజయమ్మ కోరారని సమాచారం.

అయితే ఈ భేటీ రాజకీయ సమావేశం కాదని.. కేవలం ఒకసారి అందరితో మాట్లాడటానికి పిలుస్తున్నానని విజయమ్మ వారితో చెప్పడంతో వాళ్లు రావడానికి ఒప్పుకున్నారని సమాచారం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భేటీ కాదని.. తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిలను మరింత పటిష్టంగా చేయడానికి సీనియర్ల సలహాలు తీసుకోవడానికి భేటీ ఏర్పాటు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. షర్మిల పార్టీ పెట్టి రెండు నెలల దాటినా ఇంత వరకు పార్టీ ప్రభావం ఏమీ కనపడటం లేదు. పార్టీలో గుర్తింపు ఉన్న నాయకులు ఎవరూ చేరడం లేదు. ఇది కచ్చితంగా షర్మిల రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని విజయమ్మ భావిస్తున్నది. కూతురి రాజకీయ పార్టీ ఎలా ముందుకు తీసుకొని వెళ్లాలనే దానిపై విజయమ్మ తీవ్రంగా మదనపడుతున్నట్లు కూడా తెలుస్తున్నది. ఇలాగే కొనసాగితే షర్మిల రాజకీయ జీవితం ముగిసిపోవడం ఖాయం. అందుకే కీలకమైన సీనియర్ నేతల సలహాలు తీసుకొని అలా ముందుకు వెళ్లాలని విజయమ్మ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

రెండు రాష్ట్రాలకు చెందిన వైఎస్ఆర్ సన్నిహితులను ఒక చోటకు చేర్చి వారి సలహాల ద్వారా పార్టీకి జవసత్వాలు అందించాలని ఆమె కోరుకుంటున్నది. అయితే ఆ సీనియర్లను పార్టీలో చేరమని అడగకుండా కేవలం సలహాలు అందించాలని అడగనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వైఎస్ఆర్ వర్దంతి రోజునే ఈ భేటీ జరుగనున్నది.

First Published:  29 Aug 2021 7:42 AM GMT
Next Story