Telugu Global
National

టీకాతోనే వైరస్ ముప్పు ఎక్కువ.. సంచలన సర్వే..

అమెరికాలో దాదాపు 50శాతం మందికి పైకా వ్యాక్సినేషన్ పూర్తయింది. అక్కడ బూస్టర్ డోస్ లు కూడా మొదలయ్యాయి. మరి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తో వైరస్ ని కట్టడి చేయడం నిజమే అయితే అమెరికాలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాలి, వైరస్ పూర్తిగా అంతరించిపోవాలి. కానీ పరిణామాలన్నీ దానికి వ్యతిరేకంగా ఎందుకు జరుగుతున్నాయి. అమెరికాలో కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీఎస్) చేపట్టిన సర్వేలో ఆసక్తికర […]

టీకాతోనే వైరస్ ముప్పు ఎక్కువ.. సంచలన సర్వే..
X

అమెరికాలో దాదాపు 50శాతం మందికి పైకా వ్యాక్సినేషన్ పూర్తయింది. అక్కడ బూస్టర్ డోస్ లు కూడా మొదలయ్యాయి. మరి కేసులు ఎందుకు పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తో వైరస్ ని కట్టడి చేయడం నిజమే అయితే అమెరికాలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టాలి, వైరస్ పూర్తిగా అంతరించిపోవాలి. కానీ పరిణామాలన్నీ దానికి వ్యతిరేకంగా ఎందుకు జరుగుతున్నాయి. అమెరికాలో కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీఎస్) చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా కరోనా ముప్పు అధికంగానే ఉందని ఆ సర్వేలో తేలింది.

ఉదాహరణలివే..
మసాచుసెట్స్, ప్రొవిన్స్ టౌన్ లో వ్యాక్సిన్ తీసుకున్నవారు, తీసుకోనివారు అందరూ గుంపులుగా కలసి పార్టీ చేసుకున్నారు. జులై చివరిలో జరిగిన ఈ పార్టీలో పాల్గొన్నవారిలో 469మందికి కరోనా సోకింది. అందులో మూడు వంతులమంది వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడం గమనార్హం. అంటే వ్యాక్సిన్ తీసుకున్నవారు, తీసుకోవివారు కలసి ఉన్న సందర్భంలో టీకా తీసుకున్నవారికే ఎక్కువగా వైరస్ వ్యాపిస్తోందనే విషయం తేలింది. టీకా సామర్థ్యాన్ని ప్రశ్నించే సందర్భం ఇది.

ఏదీ 100 శాతం సురక్షితం కాదు..
ఇప్పటి వరకూ కొవిడ్ నివారణకోసం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఏవీ 100శాతం సామర్థ్యంతో పనిచేయట్లేదు. 60, 70 శాతం అంటూ ఆయా సంస్థలు ప్రకటిస్తున్నాయే తప్ప.. జనబాహుళ్యంలోకి వచ్చాక వాటి సామర్థ్యం ఎంత అనేది లెక్కలు తీయలేదు. అందుకే వ్యాక్సిన్ తీసుకున్నా ప్రజలంతా మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని శాన్ ఫ్రాన్సిస్కో లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ధైర్యంతోనే నష్టం ఎక్కువ..
వ్యాక్సిన్ తీసుకోనివారిలో వైరస్ సోకుతుందేమోనన్న భయం ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్నవారు కొవిడ్ ని జయించామన్న ధైర్యంతో జనంలోకి వచ్చేస్తున్నారు, నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు, పబ్లిక్ ప్లేసుల్లో మాస్కులు లేకుండా తిరిగేస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ తీసుకున్నవారే ఎక్కువగా కొవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనివారితో పోల్చి చూస్తే.. తీసుకున్నవారికే కొవిడ్ ముప్పు ఎక్కువగా ఉందని సీడీఎస్ సర్వే చెబుతోంది.

First Published:  28 Aug 2021 11:13 PM GMT
Next Story