Telugu Global
National

కాంగ్రెస్ లో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు..

2024నాటికి బీజేపీకి చెక్ పెట్టాలని, ప్రతిపక్షాలన్నిటినీ ఏకం చేసి, కేంద్రంలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ కలలు కంటోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. అయితే ఆ పార్టీకి ఇల్లు చక్కబెట్టుకోవడమే ఇప్పుడు కష్టంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వరుసగా అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఒకచోట సద్దుమణిగాయనుకుంటే, మరోచోట సెగలు, పొగలు రేగుతున్నాయి. రాజస్తాన్ వివాదం ఏదోరకంగా ఓ కొలిక్కి వచ్చిందని అనుకుంటున్నా, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ నివురు గప్పిన నిప్పులా […]

కాంగ్రెస్ లో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు..
X

2024నాటికి బీజేపీకి చెక్ పెట్టాలని, ప్రతిపక్షాలన్నిటినీ ఏకం చేసి, కేంద్రంలో అధికారం చేపట్టాలని కాంగ్రెస్ కలలు కంటోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. అయితే ఆ పార్టీకి ఇల్లు చక్కబెట్టుకోవడమే ఇప్పుడు కష్టంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వరుసగా అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఒకచోట సద్దుమణిగాయనుకుంటే, మరోచోట సెగలు, పొగలు రేగుతున్నాయి. రాజస్తాన్ వివాదం ఏదోరకంగా ఓ కొలిక్కి వచ్చిందని అనుకుంటున్నా, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ నివురు గప్పిన నిప్పులా కనిపిస్తున్నారు. ఇక పంజాబ్ వివాదం రోజు రోజుకీ మరింత ముదురుతోంది. అధిష్టానం జోక్యంతో సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ చీఫ్ సిద్ధూ.. కాసేపు సైలెంట్ గా కనిపించినా ఆ తర్వాత సవాళ్లు, ప్రతిసవాళ్లు సహజంగా మారాయి. తాజాగా కాంగ్రెస్ కి చత్తీస్ ఘడ్ రూపంలో మరో భారం మొదలైంది.

ఛత్తీస్‌ గఢ్‌ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకునేలా భూపేష్‌ భగేల్‌, టీఎస్‌ సింగ్‌ దేవ్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఆ మేరకు భగేల్.. మొదటి విడతలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. రెండున్నరేళ్ల సమయం పూర్తి కావడంతో.. ఒప్పందం ప్రకారం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు టీఎస్‌ సింగ్‌ దేవ్‌. అయితే భగేల్ మాత్రం సీఎం గా తప్పుకోడానికి ససేమిరా అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవి కోసం టీఎస్‌ సింగ్‌ దేవ్‌.. కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. ఇద్దరు నేతలు.. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

15ఏళ్ల బీజేపీ పాలనకు బ్రేక్ వేసి 2018లో చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. అయితే సీఎం అయ్యే అర్హత మాదంటే మాదంటూ భూపేష్ భగేల్, టీఎస్ సింగ్ దేవ్ ఇద్దరూ పట్టుబట్టారు. దీంతో అధిష్టానం చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని సర్దుబాటు చేస్తామని మాటిచ్చి, ముందస్తు అవకాశం భూపేష్ కి ఇచ్చింది. తీరా ఇప్పుడు ఆయన అడ్డం తిరిగారు. రాజీనామాకు సిద్ధమేనని ప్రకటించిన తర్వాత తన మద్దతుదారులందరితో కలసి రాహుల్ గాంధీని కలిశారు. తాను రాజీనామా చేస్తే.. మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారంటూ పరోక్షంగా ఒత్తిడి పెంచారు. అటు సింగ్ దేవ్ కూడా తన అనుచరులతో ఢిల్లీలో మకాం పెట్టారు. భూపేష్ ని కొనసాగిస్తే ఊరుకునేది లేదని తెగేసి చెప్పారు. దీంతో అధిష్టానం తలపట్టుకుంది.

First Published:  27 Aug 2021 9:17 PM GMT
Next Story